Bangalore Infosys Incident
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Infosys: టాయిలెట్‌కు వెళ్లిన యువతి.. నిమిషాల్లోనే అరుపులు.. ఫోన్ చెక్ చేయగా?

Infosys: సమాజంలో కొందరు మరీ నీచాతి నీచపు పనులకు దిగజారుతున్నారు. మనల్ని నవ మాసాలు కనిపించి, పోషించిన తల్లి.. మహిళ అనే విషయాన్ని మరిచి ఆడవారి పట్ల దారుణాతి దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఓ యువకుడు తాను పనిచేస్తున్న ఆఫీసులోని టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని రహస్య వీడియోలు చిత్రీకరించాడు. అయితే సహోద్యోగిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత దారుణమైన ఈ ఘటన దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఆరోపణలతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. బెంగళూరు (Bangalore) ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఓ మహిళా ఉద్యోగి జూన్ 30న రెస్ట్‌ రూమ్‌కు వెళ్లింది. అయితే నిమిషాల్లో లోపలి నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. ఆ మహిళకు ఎదురుగా ఉన్న తలుపు వద్ద ప్రతిబింబం గమనించింది. దీంతో ఎవరో తనను వీడియో రికార్డు చేస్తున్నట్టుగా ఆ ఉద్యోగిని అనుమానించింది. వెంటనే ఆమె తనిఖీ చేయగా నివ్వెరపోయే విషయం వెలుగుచూసింది. స్వప్నిల్ నగేష్ మాలి అనే వ్యక్తి తనను వీడియో తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించింది.

Read Also- Siddharth Kaushal: సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక ఏం జరిగింది.. ఎందుకీ పరిస్థితి?

infosys

50కి పైగా వీడియోలు!
రెడ్ హ్యాండెడ్‌గా స్వప్నిల్‌ను పట్టుకోవడంతో తాను చేసింది తప్పేనని, క్షమాపణలు చెప్పాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్ఫోసిస్ యాజమాన్యం ఆరా తీసింది. నిందితుడు ఫోన్‌ను నిశితంగా పరిశీలించగా పలువురు మహిళలకు చెందిన 50కి పైగా వీడియోలను యాజమాన్యం గుర్తించింది. వెంటనే హెచ్ఆర్ సిబ్బంది ఆ వీడియోలన్నీ డెలీట్ చేసినట్లుగా సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహిళా ఉద్యోగి భర్త కంపెనీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఈ ఘటనపై సదరు మహిళా ఉద్యోగి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెంటనే స్వప్నిల్‌ను అరెస్టు చేశారు. కాగా, ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్న నగేష్ పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఇలాగే ఇతర మహిళలను వీడియో తీసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే, నగేష్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Nagesh Swapnil Mali

జాబ్ హుష్!
స్వప్నిల్ నగేష్ మాలి మహారాష్ట్రలోని సాంగ్లికి చెందినవాడు. ఇన్ఫోసిస్‌లో మూడు నెలల క్రితమే చేరాడు. అప్పట్నుంచే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే స్వప్నిల్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 77, ఐటీ చట్టంలోని పలు సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ తర్వాత ఆ ఉద్యోగిని తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ దర్యాప్తు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపైనే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే, అంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ.. ఎందుకీ పాడు పనులు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎంత పనిచేశావురా నీచుడా.. నిన్ను ఉరితీసినా తప్పులేదురా’ అంటూ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

Read Also- Shirish Reddy: రామ్ చరణ్‌ని అవమానించడమా.. అది నా జన్మలో జరగదు!

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?