Hyderabad MMTs Incident: ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన అత్యాచార యత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మహేశ్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ ను పట్టుకోవటానికి ఉన్నతాధికారులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలిపై నిందితుడు అత్యాచారం చేసేందుకు నిందితుడు యత్నించాడు. నిందితుడు చేసిన పనికి బాధితురాలు భయంలో ట్రైన్ లోంచి దూకేసింది.
Sangareddy District Crime: దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం
అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వచ్చిన ఓ యువతి.. మేడ్చల్ లోని మహాలక్ష్మి ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్నది. బాధితురాలు ఈనెల 22న రాత్రి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు ఎంఎంటీఎస్ రైల్లో వెళుతుండగా ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడి యత్నించాడు. దాంతో భయపడ్డ బాధితురాలు నడుస్తున్న రైల్లో నుంచి కిందకు దూకేసింది.
తీవ్ర గాయాలైన ఆమెను మొదట గాంధీ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం యశోధా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఏకంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ అయిన ఎంఎంటీఎస్ లో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో.. పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు. రైల్వే ఎస్పీ చందనా దీప్తి స్వయంగా కేసు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో ఉన్న బాధితురాలితో వివరాలు సేకరించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని తెప్పించి పరిశీలించారు. దీంట్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి ఫోటోను బాధితురాలికి చూపించగా తనపై లైంగిక దాడికి పాల్పడింది ఆ వ్యక్తేనని గుర్తు పట్టింది.
ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేయగా సదరు వ్యక్తి మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన మహేశ్ అని వెల్లడైంది. అతనిపై ఇంతకు ముందే పలు కేసులు నమోదై ఉన్నట్టుగా తేలింది. మహేశ్ ప్రవర్తనతో విసిగిపోయిన అతని భార్య ఏడాది క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టుగా తెలిసింది. తల్లిదండ్రులు కూడా లేకపోవటంతో అప్పటి నుంచి మహేశ్ ఒంటరిగానే జీవనం గడుపుతున్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో గంజాయికి బానిసైన మహేశ్ పలు నేరాలకు కూడా పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో యువతిపై లైంగిక దాడి జరిపినపుడు కూడా మహేశ్ గంజాయి మత్తులో ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
చిక్కిన నిందితుడు
యువతిపై అత్యాచారయత్నం చేసింది మహేశ్ అని నిర్ధారణ కావటంతో 4 ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకోవటానికి రంగంలోకి దిగి నిందితుణ్ని పట్టుకున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు రైల్వే ఎస్పీ చందనా దీప్తీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు యువతి కోలుకున్న తర్వాత వెళ్లడిస్తామన్నారు. కాగా, నిందితుడు గాలింపులో భాగంగా.. ఓ బృందం మహేశ్ స్వగ్రామమైన గౌడవెల్లికి కూడా వెళ్లినట్టు తెలిసింది. స్థానికుల ద్వారా మహేశ్ బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు? అతని స్నేహితులు ఎవరు? అన్న వివరాలను సేకరించినట్టు సమాచారం.