Hyderabad Crime: హైదరాబాద్‌లో గోరం.. యువకుడు దారుణ హత్య.!
Hyderabad Crime (imagecredit:twitter)
క్రైమ్

Hyderabad Crime: హైదరాబాద్‌లో గోరం.. యువకుడు దారుణ హత్య.!

Hyderabad Crime: కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరై తిరిగి వెళుతున్న యువకున్ని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలే నాంపల్లిలోని ఎంఎన్జే క్యాన్సర్​ ఆస్పత్రి వద్ద జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, ఇది ప్రతీకార హత్య అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఫూల్‌ బాగ్ ప్రాంత నివాసి అయాన్​ ఖురేషి (22) హత్య కేసులో నిందితుడు. నాంపల్లి జువెనైల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇదే కేసులో అయాన్​ ఖురేషి కోర్టుకు హాజరయ్యాడు. విచారణ ముగిసిన అనంతరం తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. కాగా, రెండు బైక్ లపై అతన్ని వెంబడించిన అయిదుగురు దుండగులు ఎంఎన్జే క్యాన్సర్​ ఆస్పత్రి వద్ద అడ్డుకున్నారు.

ఆ వెంటనే క్రికెట్ బ్యాట్, కత్తులతో దాడి చేశారు. కింద పడేసి గొంతు కోయటంతోపాటు ఒంటిపై పలు చోట్ల పొడిచారు. దాంతో అయాన్​ ఖురేషి రక్తం మడుగులో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలియగానే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. దుండగులు అక్కడే వదిలేసి వెళ్లిన క్రికెట్ బ్యాట్​, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. దీని ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం వేట మొదలు పెట్టారు.

Also Read: Naveen Chandra: ఆ విషయంలో నవీన్ చంద్ర భార్యను టార్చర్ చేస్తున్నాడా?

ప్రతీకారంతోనే హత్య

కాగా, ప్రతీకారంతోనే అయాన్​ ఖురేషిని దుండగులు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయాన్​ ఖురేషి తండ్రికి ఇద్దరు భార్యలు. అతని రెండో భార్య కూతురు మునావర్​అనే యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి అయాన్​ ఖురేషితోపాటు అతని తండ్రికి ఇష్టం లేదు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 2020లో ముందస్తు పథకం ప్రకారం మునావర్​ను దారుణంగా హత్య చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన కాంచన్ బాగ్​ పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

ఆ సమయంలో అయాన్​ ఖురేషి వయసు 17 సంవత్సరాలు కావటంతో అతనిపై జువెనైల్​ కోర్టులో విచారణ సాగుతోంది. కాగా, మునావర్​ సంబంధీకులు ప్రతీకారం తీర్చుకోవాలని అయాన్​ ఖురేషి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టారు. కేసు విచారణ కోసం అతను కోర్టుకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో చంపాలని కుట్ర చేశారు. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టుల వద్దకు చేరుకున్నారు. కేసు విచారణ ముగిసిన తరువాత అయాన్​ ఖురేషి తన బైక్​ పై ఇంటికి బయల్దేరగా వెంబడించి క్యాన్సర్​ ఆస్పత్రి వద్ద అడ్డుకుని హతమార్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: Vijay Antony: విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క