Naveen Chandra: టాలీవుడ్ లో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేశాడు. అయితే, గత రెండు రోజుల నుంచి నవీన్ చంద్ర గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
నవీన్ చంద్ర తన భార్యను విసిగిస్తున్నాడని, బాధను తట్టుకోలేక ఆమె చుట్టు పక్కల వారికి చెప్పిందని, వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. అయితే, దీనిలో ఎంత వరకు నిజముందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Indian Overseas Bank Recruitment: డిగ్రీ అర్హతతో బ్యాంక్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి!
నవీన్ చంద్ర త్వరలో తన లెవెన్ సినిమాతో మన ముందకొస్తున్నాడు. అయితే, మూవీ ప్రమోషన్స్ లో నమ్మలేని నిజాలు బయట పెట్టాడు. నవీన్ చంద్ర మాట్లాడుతూ ” నేను ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించాను.. చేసిన పాత్రాలన్ని సైకో, శాడిస్ట్ భర్తగా కనిపించాడు. జిగర్ తండా, అమ్ము, మంత్స్ ఆఫ్ మధు వంటి మూవీస్ లో నా క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇక మంత్స్ ఆఫ్ మధు మూవీలో కలర్స్ స్వాతిని వేధిస్తూ ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకునే పాత్ర చేశాను. అలాగే, అమ్ము మూవీలో కూడా భార్యను అనుమానిస్తూ ఉండాలి.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
ఇలా నేను కొన్నిమూవీస్ లో కనిపించడంతో మా బంధువులు అందరూ ఇంట్లో కూడా అలాగే ఉంటానని అనుకున్నారు. అనుమానం వచ్చి మా ఆవిడని కూడా అడిగారట. మీ ఆయన ఇంట్లో కూడా అలాగే ఉంటారా? కోపంగా ప్రవర్తిస్తారా.. మీ ఆయన ఇబ్బంది పెడితే మాకు చెప్పు వెళ్లి కంప్లైంట్ చేద్దామని అన్నారట. ఇది విని ముందు షాక్ అయ్యాను.