Supreme Court
క్రైమ్

‘ఎన్నికలకు ముందు ఎంతమందిని జైలుకు పంపుతారు?’

Supreme Court: తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబర్ బెయిల్‌ పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అపవాదు మోపారని ఎంతమందిని జైలులో వేస్తారని ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు యూట్యూబ్‌లో విమర్శలు చేశారని జైలుకు పంపించడం చేస్తూ ఉంటే ఎంత మంది జైలులో పడుతారో ఊహించారా? అంటూ తమిళనాడు ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గిని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌ల ద్విసభ్య ధర్మాసనం అడిగింది.

ఒక వేళ బెయిల్ కొనసాగించినా ఆ యూట్యూబర్ పై మళ్లీ ఇలాంటి ఆరోపణలు, అపవాదులు ప్రభుత్వంపై చేయకుండా ఆంక్షలు విధించాలని ముకుల్ రోహత్గి ద్విసభ్య ధర్మాసాన్ని కోరారు. కానీ, ఏది అపవాదు, ఏది కాదు.. నిర్ధారించేది ఎవరు? అని ప్రశ్నించింది. ఆ యూట్యబర్ పై ఆంక్షలు విధించడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.

Also Read: ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఎ దురైమురుగన్ సత్తాయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఆ కేసులో మద్రాస్ హైకోర్టు సత్తాయికి బెయిల్ ఇవ్వలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దురైమురుగన్ సత్తాయి తనకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛన దుర్వినియోగం చేసినట్టు ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది. తాజాగా, మరోసారి ఆయన బెయిల్‌ను రీస్టోర్ చేస్తుండగా తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి పై విధంగా వాదించారు. ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. జులై 2022లో బెయిల్ అంశంపై సుప్రీంకోర్టు విచారించింది. మొత్తంగా ఆయన 2.5 ఏళ్లకు పైగా బెయిల్ పై బయటే ఉన్నారు.

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..