Saturday, May 18, 2024

Exclusive

PK: ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?

YCP: ఎన్నికల వ్యూహకర్తగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్‌కు ఇప్పటికీ పేరు ఉన్నది. ఆ పని మానేసి రెండు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ బ్రాండ్ ఆయనపై ఉన్నది. అందుకే ఆయన చేసే కామెంట్లకు అంత విలువ ఇస్తుంటారు. కానీ, క్షేత్రస్థాయి సర్వేలు చేయకున్నా ఆయన అంచనాలు నిజం అవుతాయని ఎలా నమ్మగలం? ఆయన అంచనాలు తప్పడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్చ అంతా ఇప్పుడు ఎందుకు అంటే.. పీటీఐకి ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనం అవుతున్నది.

ఇక కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీపైనా ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుందని అన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవాలని సూచించారు. అదే ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా ఉంచినప్పటికీ రాహుల్ గాంధీనే పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు.

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందని, తొలి లేదా ద్వితీయ స్థానంలో ఈ పార్టీ ఉంటుందని పీకే జోస్యం చెప్పారు. ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేవని అన్నారు. జగన్ అభివృద్ధి చేయడం లేదని, ఉద్యోగాలు కల్పించడం లేదని చెప్పారు. ఆయన ఒక ప్రభుత్వ పెద్దగా ప్రజాభివృద్ధిని చేపట్టకుండా కేవలం డబ్బులు అందించే ఒక ప్రొవైడర్‌గా మాత్రమే ఉంటున్నారని వివరించారు.

Also Read: కవితకు కోర్టులో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

ప్రశాంత్ కిశోర్ చెప్పిన వాటిలో వాస్తవాలు ఉండొచ్చు. కానీ, గెలుపోటములపై ఆయన చెబుతున్న అంచనాలు తరుచూ తప్పుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ కూడా స్వయంగా ఒక రాజకీయ నాయకుడిగా మారిన తరుణంలో ఆయన నుంచి నిష్పక్షపాత విశ్లేషణ, అంచనాను ఎలా ఆశించగలం. నిజానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే బీజేపీని విమర్శించినట్టు అనిపించినా మిగిలిన పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన గావించడానికి, ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నించాడు. కానీ, అందులో సఫలం కాకపోవడంతో బిహార్‌లో సురాజ్ క్యాంపెయిన్ పేరిట ప్రచారం మొదలుపెట్టారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి తప్పారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని చెప్పారు. కానీ, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందనీ చెప్పి తప్పారు. ఈ తరుణంలోనే తాజాగా పీకే వెల్లడించిన అంచనాలకు విశ్వసనీయత తగ్గిందనే చెప్పాలి.

Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి

వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదనే పీకే అంచనాలను ఆ పార్టీ తిప్పికొట్టింది. చంద్రబాబుతో ప్యాకేజీ అందుకుని కృతజ్ఞతతో ఈ అంచనాలు చెబుతున్నావని ఆరోపించింది. అసలు రాష్ట్రాభివృద్ధి ఎవరు చేశారనేది కేంద్ర గణాంకాలు చూస్తే అర్థం అవుతుందని, విద్య, వైద్యం, ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాల్లో వృద్ధి, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవాలని కౌంటర్ వేసింది. ఊరక బురద జల్లడం సరికాదని ట్వీట్ చేసింది.

ఒక వైపు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మారడం, వ్యూహకర్తగా చేయకపోవడం, చంద్రబాబునీ ప్రైవేట్‌గా కలవడం వంటి అంశాలు వాస్తవంగానే పీకే వ్యాఖ్యల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముతున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:గులాబీల్లో ‘లోకల్’ గుబులు

బీఆర్ఎస్ తో కొనసాగుతున్న వలసలు అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలోనూ...

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ...

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

Don't miss

Hyderabad:గులాబీల్లో ‘లోకల్’ గుబులు

బీఆర్ఎస్ తో కొనసాగుతున్న వలసలు అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలోనూ...

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ...

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

Hyderabad:గులాబీల్లో ‘లోకల్’ గుబులు

బీఆర్ఎస్ తో కొనసాగుతున్న వలసలు అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలోనూ జంపింగ్స్ కొత్తగా భయపెడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని జిల్లాలలో ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన స్థానిక నేతలు ఉమ్మడి...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు జరగవలసిన మంత్రి వర్గ సమావేశంపై సంధిగ్దం నెలకొంది. నిధుల సేకరణ, రుణమాఫీ తదితర అంశాలపై చర్చించేందుకు నేడు కీలక మీటింగ్...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బులు పంచాడని ఆరోపించారు. ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని...