Leopard, tiger
క్రైమ్

Leopard: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. రేపు నల్లమల అడవిలోకి

Tiger: గత వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపిన చిరుత సంచారం సుఖాంతం
అయింది. ఐదు రోజులపాటు బోను వరకు వచ్చి వెనుదిరిగిన చిరుత ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది.
మేకను ఎరగా వేసినా ఆ చిరుత అటువైపుగా రాలేదు. బోనులు వేసినా చిక్కలేదు. చివరకు శుక్రవారం
ఎరగా వేసిన మేకను తినడానికి వచ్చి ఓ బోనులోకి చిక్కుకుంది.

గొల్లపల్లి మీదుగా ఎయిర్‌పోర్టు వైపు వచ్చిన చిరుత ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి దూసుకొచ్చింది. ఐదు
రోజుల క్రితం ఆ చిరుత రన్ వేపైకి వచ్చింది. దీంతో అలార్మ్స్ మోగడంతో అధికారులు సీసీకెమెరాల్లో చూసి
గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ
చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఐదు బోనులు ఏర్పాటు చేశారు.
20 ట్రాప్ కెమెరాలూ పెట్టారు.

Also Read: చిరుత.. దోబూచాట

ఐదు రోజుల వరకు ఆ చిరుత బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోయింది. మేకను ఎరగా వేసినా పులి
చిక్కకపోవడం గమనార్హం. ఎట్టకేలకు శుక్రవారం మేకను మరోసారి ఎరగా వేసి సక్సెస్ అయ్యారు. ఆ
చిరుత మేక కోసం వచ్చి బోనులో చిక్కింది. ఎయిర్‌పోర్టు నుంచి ఆ చిరుతను నెహ్రూ జూపార్క్‌కు
తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఒక రోజుపాటు జూ అధికారులు తమ పర్యవేక్షణలో
ఉంచనున్నారు. ఆ తర్వాత రోజు నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నట్టు అటవీ శాఖ అధికారులు
వెల్లడించారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు