Tuesday, May 28, 2024

Exclusive

Leopard: చిరుత.. దోబూచాట

Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయ అధీనంలోని భూభాగంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత అక్కడ సంచారం చేస్తూ కలవరపెట్టడమే కాకుండా.. దాన్ని బంధించడానికి ఏర్పాటు చేసిన బోనులను పరిహసిస్తూ తప్పించుకు తిరుగుతూ మరో సవాల్‌ను విసురుతున్నది. మంగళవారం రాత్రి ఆ చిరుత బోనుకు అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిపోయింది. నీటి కుంటల వద్ద బోనులు ఏర్పాటు చేశారు. బోనుల సంఖ్యను పెంచారు. అయినా ఆ చిరుత చిక్కడం లేదు. ఏకంగా ఎరగా మేకను వేసినా పచ్చి శాకహారిలా బోను దగ్గరికి రాకపోవడం ఆందోళనతోపాటు ఆశ్చర్యాన్నీ కలుగజేస్తున్నాయి. ఆరు రోజులుగా అధికారులతో చిరుత దోబూచులాడుతున్నది.

విమానాశ్రయం అధీనంలోని ఖాళీ స్థలంలో పెద్దగా చెట్లు, పొదలు దట్టంగా ఉండటంతో చిరుత అక్కడే దాక్కుని ఉంది. అక్కడే నీటి కుంటలు కూడా ఉండటంతో చిరుత నీరు తాగడానికి బయటికి రావాల్సిన అవసరం లేకపోతున్నది. మంగళవారం రాత్రి 8 గంటలకు సీఐఎస్ఎఫ్ అధికారులకు చిరుత కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులను అలర్ట్ చేశారు. చిరుతను పట్టుకోవడానికి బోనుల సంఖ్యను పెంచారు. నీటి కుంటల వద్ద మరో మూడు బోనులను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఆ చిరుత బోనుకు అత్యంత సమీపానికి వెళ్లి వెనుదిరిగింది.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ జోష్.. రాహుల్, ప్రియాంక ప్రచారం ముమ్మరం

చిరుతను బంధించడానికి అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చిరుత నిన్నటి కదలికలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న రెండు ఏరియాలను కనుక్కున్నారు. ఆ చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లుతున్నదో నిఘా పెట్టి.. ఒకట్రెండు రోజుల్లో చిరుతను బంధిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Publisher : Swetcha Daily

Latest

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Food Inflation: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?

Any Check On Food Inflation: దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో...

Don't miss

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Food Inflation: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?

Any Check On Food Inflation: దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో...

Phone Tapping: ట్యాపింగ్ ఫైల్స్.. ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’

- కుట్రదారులెవరు? పాత్రధారులెవరు? - ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు - కీలకంగా నిందితుల వాంగ్మూలాలు - ట్యాపర్స్ ఎవరో, విక్టిమ్స్ ఎవరో ఫుల్ క్లారిటీ - నిజమైన ‘స్వేచ్ఛ’ కథనాలు - అన్నీ ఒప్పేసుకున్న పోలీస్ ఆఫీసర్లు -...

MLC Kavitha: అది అక్రమ అరెస్టు.. ఇకనైనా బెయిల్ ఇవ్వండి

- ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే ఛార్జ్‌షీటా? - ఫోన్లు ధ్వంసం ఆరోపణ అన్యాయం - కక్షసాధింపు ధోరణిలో ఈడీ, సీబీఐ తీరు - కవిత తరపు లాయర్ అభ్యంతరాలు - మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు Delhi...

Hyderabad:వామ్మో.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇంత చేశారా?

 విభేదించిన ఎవరినీ వదలని కేసీఆర్ సర్కారు  విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులనూ వదలని వైనం ట్యాపింగ్ బాధితుల్లో సగం సొంత పార్టీ వారే  ఎన్టీవీ, ఆంధ్రజ్యోతి ఎండీలూ బాధితులే రేవంత్...