Film Nagar Theft: ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. షేక్ పేట ఆల్-హమ్రా కాలనీలో నివాసం ఉండే డాక్టర్ కమ్రాన్(Dr. Kamran) జహాన్(Jahan) అనే దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వారి ఇంట్లోని 35 తులాలు బంగారం, 3.5 లక్షలు డబ్బులనుద దొంగలు ఎత్తుకెళ్లారు. చోరి జరిగిన భాదితుడు డాక్టర్ కమ్రాన్ జహాన్ తన కుటుంబంతో కలిసి అస్సాంకి వెళ్లారు. దీంతో ఎవరు లేని సమయం చూసుకోని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.
Also Read: TGPSC Recruitment: రెండేళ్లలో ప్రభుత్వం 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఇవిగో లెక్కలు
వాచ్ మెన్ మైరాజ్..
అయితే ఈ నెల 6 వ తేదీన మధ్యాహ్నం సమయంలో వాచ్ మెన్ మైరాజ్(Myraj) ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే వాచ్ మెన్ మైరాజ్ ఓనర్ కమ్రాన్(Kamran) కి సమాచారం ఇచ్చాడు. కమ్రాన్ అందు బాటులోకి లేకపోవడంతో తన బంధువులు ఫిల్మ్ నగర్ పోలీసుల(Film Nagar Police)కి పిర్యాదు చేసారు. దింతో వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాల(CC Camera) ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: New Guy In Town: సంచలనం రేపుతున్న ఎస్. థమన్ ట్వీట్.. టాలీవుడ్లో ఆ మిస్టీరియస్ ‘న్యూ ఫేస్’ ఎవరు?

