తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Drugs Seized: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఓ ఐఏఎస్ అధికారి కుమారుడు డ్రగ్స్ తో గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ వద్ద పట్టుబడినట్టు తెలిసింది. పక్కగా సమాచారాన్ని సేకరించి ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సదరు యువకున్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి మాదక ద్రవ్యాలు సీజ్ చేసినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారి కుమారుడు శరత్ సిటీ మాల్ వద్ద డ్రగ్స్ తో దొరికిపోయాడు. ఐఏఎస్ అధికారి కుమారుడు కావటంతో అధికారులు వివరాలను వెల్లడించటం లేదు. అయితే, డ్రగ్స్ ఎవరి నుంచి తీసుకున్నాడు? సొంతానికి వాడుతున్నాడా? ఇతరులకు విక్రయిస్తున్నాడా? అని అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. దీనిపై శేరిలింగంపల్లి ఎక్సయిజ్ పోలీసులతో మాట్లాడగా దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
Also Read: Vijayashanthi: పవన్ సతీమణి అన్నాపై ట్రోల్స్.. రాములమ్మ షాకింగ్ పోస్ట్