Vijayashanthi: రాములమ్మ విజయశాంతి రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలియంది కాదు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే విషయాలపై ఆమె తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమలలో మొక్కులు తీర్చుకోవడంపై నడుస్తున్న ట్రోల్స్‌పై ఆమె ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాపై ట్రోల్ చేయడం తప్పు అని ఆమె చెప్పకనే చెప్పేశారు.
Also Read- Jr NTR: ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్ తెచ్చిన ‘ఆది’ సినిమాకు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో తెలుసా?
సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకని వెళ్లిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar), అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయపడటంతో పాటు, ఓ చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోయింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌కు వెంటనే అందాల్సిన చికిత్స అందడంతో, ఆ పిల్లాడు కోలుకున్నాడు. దీంతో పవన్, అన్నాలు తమ కుమారుడిని తీసుకుని సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడటానికి తిరుమల వేంకటేశ్వరుని అనుగ్రహం ఉందని భావించిన అన్నా.. వెంటనే రావడమేంటో తిరుమల చేరుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అన్యమతానికి చెందిన అన్నా.. ఇలా తిరుమలలో మొక్కులు తీర్చుకోవడంపై కొందరు కావాలని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read- Priyanka M Jain: హద్దులు దాటుతున్న గ్లామర్ షో.. అస్సలు తగ్గట్లే!
ఈ ట్రోల్స్‌ని మెగాభిమానులు, జనసైనికులు కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. శృతిమించి కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్న వారిపై కేసులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాములమ్మ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా అన్నా లెజినోవాకు మద్దతు తెలిపింది. ఆమెపై ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అని ఆమె అన్నారు. ఈ మేరకు విజయశాంతి చేసిన పోస్ట్‌లో..
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 15, 2025
‘‘దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.
హరహర మహాదేవ్
జై తెలంగాణ
విజయశాంతి’’ అని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు