Jr NTR: ప్రస్తుతం టాలీవుడ్ నేమ్‌ని ప్రపంచ సినిమా పటంపై నిలిపిన హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో ఆయన నటనకు జనాలు నీరాజనాలు పలికారు. ఆ తర్వాత చేసిన ‘దేవర’ (Devara) సినిమా కూడా పాన్ ఇండియా వైడ్‌గా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘వార్ 2’తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్, మరోవైపు పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చిన ‘కెజియఫ్’ దర్శకుడితో ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్‌కు మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిన సినిమా ఏదయ్యా? అంటే మాత్రం వెంటనే వివి వినాయక్‌తో చేసిన ‘ఆది’ సినిమా అనే అంతా అంటారు.
Also Read- Kuberaa Song Promo: పిచ్చిపిచ్చిగా.. ధనుష్ ధమాకా అదిరింది
ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ హీరోగా ‘నిన్ను చూడాలని’, ‘స్టూడెంట్ నెం 1’, ‘సుబ్బు’ చిత్రాలను చేశారు. కానీ వివి వినాయక్ (VV Vinayak)తో చేసిన ‘ఆది’ (Aadi) సినిమా మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌ని, మాస్ ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. ఆ సినిమా తర్వాత ఇక ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కాకపోతే, ఈ సినిమా గురించి ప్రస్తుతం ఆసక్తికర విషయం ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ ఆసక్తికర విషయం ఏమిటో కాదు, ‘ఆది’ సినిమాకు మొదట ఎన్టీఆర్‌ని కాకుండా మరో హీరోతో చేయాలని అనుకున్నారట. ఆ హీరోనే ఆకాష్. అవును, వివి వినాయక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చే క్రమంలో ఆకాష్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ‘బింబిసార’, ‘విశ్వంభర’ చిత్రాల దర్శకుడు వశిష్ఠ తండ్రి తన తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
Also Read- Sumaya Reddy: కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఖర్చు పెడుతుంటే బాధగా ఉండేది
వశిష్ఠ తండ్రి ఎవరో కాదు డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారి ‘ఢీ, బన్ని, భగీరథ’ వంటి చిత్రాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి. మొదట్లో వశిష్ఠను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని సత్యనారాయణ రెడ్డి ప్రయత్నించారు. ఫైనల్‌గా కుమారుడిని దర్శకుడిగా లాంఛ్ చేశారు. ఇక తన తాజా ఇంటర్వ్యూలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వివి వినాయక్‌తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. బెల్లంకొండ సురేష్ ఆయనకి అవకాశం ఇచ్చారు. ‘ఆది’ సినిమాను ఆకాష్ హీరోగా చేయాలని అన్ని రెడీ చేసుకున్నారు. కానీ అది అనేక మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆ సినిమా ఎలా ఆడిందో అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు.
నిజంగా ఆయన రివీల్ చేసిన విషయం తర్వాత, ఆకాష్ (Akash) ఎంత బ్యాడ్ లక్ హీరోనో అని అంతా అనుకుంటూ ఉండటం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 3 చిత్రాలలో ఒకటిగా ఆది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని ఒక్కో సన్నివేశంలో ఎన్టీఆర్ జీవించేశారు. నిజంగా ఆకాష్ చేసి ఉంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. ఎన్టీఆర్‌కి పర్ఫెక్ట్ సినిమా అంటే ‘ఆది’నే అనేంతగా ఇప్పటికీ ఆ సినిమా గురించి ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారంటే.. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ అలా ఉంటుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు