Kuberaa Song Promo: ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna) కాంబోలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ‘కుబేర’ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఆయన సినిమా ఓకే చేశాడంటే చాలు, అందులో మంచి కంటెంట్ ఉంటుందనేలా శేఖర్ కమ్ముల గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులోనూ ఈసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ని, టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు మొదలయ్యాయి.
Also Read- Mega157: అయ్యబాబోయ్.. అనిల్ మాములు స్కెచ్ వేయలేదుగా!
ధనుష్, నాగార్జునలతో పాటు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా సినిమా ఇది. అద్భుతమైన తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఒక గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోందని మేకర్స్ మొదటి నుంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల మ్యూజిక్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.
‘కుబేర’ కోసం కూడా ఓ అద్భుతమైన ఆల్బమ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో హీరో ధనుష్ ఈ పాటలో విజిల్ వేస్తూ.. పిచ్చపిచ్చగా డ్యాన్స్ చేస్తున్నాడు. ‘పోయిరా మామ’ (Poyiraa Mama) అంటూ సాగుతున్న ఈ పాటకు దేవిశ్రీ మరోసారి తన మార్క్‌ను ప్రదర్శించారు. భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ పాటను స్వయంగా ధనుష్ పాడారు.
Also Read- Sumaya Reddy: కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఖర్చు పెడుతుంటే బాధగా ఉండేది
అంతకు ముందు సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ధనుష్ విజిలేస్తూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఆ పోస్టర్‌కు రిలేటెడ్‌గా ఈ ప్రోమో ఉంది. ఫుల్ లిరికల్ సాంగ్ ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా ఉన్న ‘కుబేర’ చిత్రాన్ని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLP పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. 20 జూన్, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు