Excise Raids( IMAGE credit: swetcha reporter)
క్రైమ్

Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్​ ఉద్యోగుల అరెస్ట్

Excise Raids: ఫాం హౌస్‌లో డ్రగ్స్‌తో పార్టీ చేసుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యం సీసాలతోపాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం(Shahnawaz Qasim)కథనం ప్రకారం.. అభిజిత్ బెనర్జీ డెల్​ కంపెనీ ఉద్యోగి. తన బర్త్ డే కావడంతో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చేవెళ్లలోని సెరీన్​ ఫాంహౌస్‌ను బుక్ చేసుకున్నాడు. తనతోపాటు సాఫ్ట్‌వేర్​ ఇంజినీర్లుగా పని చేస్తున్న మరో ఐదుగురు స్నేహితులతో కలిసి కార్లలో  రాత్రి ఫాంహౌస్‌కు చేరుకున్నాడు. అంతా కలిసి విదేశీ మద్యంతోపాటు డ్రగ్స్ సేవిస్తూ దావత్ మొదలు పెట్టారు.

Also Read: Viral News: బాస్మతి రైస్‌పై డిస్కౌంట్ ప్రకటన.. మాల్‌లో ఊహించని సీన్

కేసులు నమోదు

ఈ మేరకు పక్కగా సమాచారం అందడంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బీటీం సీఐ భిక్షపతి,(CI Bhikshapati,)ఎస్​ఐ బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి ఫాంహౌస్‌పై దాడి చేశారు. అభిజిత్​ బెనర్జీ, ప్రతాప్​ గోయల్, జస్వంత్, దినేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 విదేశీ మద్యం సీసాలు, 50 గ్రాముల ఎల్​ఎస్​డీ బ్లాస్ట్ పేపర్లు, 20.21 గ్రాముల హాషిష్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు జరిపించగా అందరూ మాదక ద్రవ్యాలు సేవించినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఇక, ఫాం​హౌస్​ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు.

 Also Read: Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!