Crime News: వశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్(Hyderabad) తీసుకొస్తున్న వ్యక్తిని సంగారెడ్డి ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే హ్యాష్ ఆయిల్(Hash Oil) ను స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్(Katedan) ప్రాంతంలోని బృందావన్ కాలనీ నివాసి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) చాలాకాలంగా మాదక ద్రవ్యాల దందా చేస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. అయినా, మాదక ద్రవ్యాల దందా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల విశాఖ ఏజన్సీ ప్రాంతానికి వెళ్లి పెద్ద మొత్తంలో హ్యాష్ ఆయిల్ ను కొన్నాడు. దానిని తీసుకుని హైదరాబాద్ బయల్దేరాడు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐలు గాంధీనాయక్, వీణా రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్ కుమార్, యాదయ్య, దిలీప్ కుమార్ తోపాటు సిబ్బందితో కలిసి కంది నుంచి శంకర్ పల్లి రోడ్డులో మాటు వేశారు. హ్యాష్ ఆయిల్‌తో అనిల్ కుమార్ యాదవ్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి సంగారెడ్డి(Sangareddy) ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
200 గంజాయి ప్యాకెట్లు సీజ్..
సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారంతో ఎక్సయిజ్ ఎస్టీఎఫ్ బీటీం సీఐ భిక్షారెడ్డి(CI Bhiksha Reddy), ఎస్ఐ బాలరాజు(SI Balaraju)తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేశారు. సోహైల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 200 ప్యాకెట్లలో ఉన్న 880 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగ్ పూర్(Nagpur) నుంచి గంజాయి తెస్తూ హైదరాబాద్(Hyderabad) లో అమ్ముతున్నట్టుగా విచారణలో తేలింది.
ఉప్పల్‌లో..
ఇక ఉప్పల్ విజయపురి కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసి ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి దాడి జరిపారు. రవితేజ, జగదీశ్వర్, దిలీప్, చరణ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 325 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Also ReadL: Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
