Kishan Reddy (image credit: twitter)
Politics

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: రాష్ట్రంలో పవర్ జనరేషన్ కంపెనీలు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కంలను అప్పుల ఊబిలో నెట్టేసిందని విమర్శించారు. ప్రతీ రంగానికి విద్యుత్ కీలకమని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరింత పెంచాల్సిన అవసరముందన్నారు. సింగరేణికి బకాయిపడిన రూ.42 కోట్లను అందించడంపై సర్కార్ దృష్టిపెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. పీఎం కుసుమ్ స్కీమ్ రైతులకు ఎంతో మేలు చేస్తోందన్నారు. పీఎం కుసుమ్ సోలార్ పవర్ గ్రిడ్ ద్వారా రైతే రాజు అనేందుకు నిదర్శనంగా మారిందన్నారు.

Also ReadKishan Reddy: రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా

4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్

తెలంగాణకు 40 వేల పీఎం కుసుమ్ సోలార్ పంపుసెట్లను అందించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే 50 వేల సోలార్ రూఫ్ టాప్ లు కావాలని కేంద్రాన్ని కోరగా వాటిని అందించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ లో 80 శాతం విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని వివరించారు. ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కోరారు. సోలార్ విద్యుత్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల పని అయిపోయిందని ఎద్దేవాచేశారు. డిస్కంలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఇదిలా ఉండగా నేషనల్ డిజాస్టర్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, రూ.400 నుంచి రూ.500 కోట్లు ఉన్నాయన్నారు.

ప్రతి ఒక్కరికీ నష్ట పరిహారం అందించాలి

కేంద్ర నిధుల నుంచి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు మరో మూడేండ్ల సమయమే ఉందని, సచివాలయం నుంచి పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోయేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ ధీరుడు, వీరుడైతే ఇన్నాళ్లు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. మంత్రి పదవి ఎన్నికల స్టంట్ కాదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి తొలుత పటేల్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ కు నొప్పి అని, పీవీ నరసింహారావు అంటే కూడా కాంగ్రెస్ కు నచ్చదని పేర్కొన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ కు నచ్చుతుందన్నారు. పటేల్ ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు. ఆపై సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కంధగిరి ఆలయంలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులను కిషన్ రెడ్డి తీసుకున్నారు. కాగా  సాయంత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లోని పలు కాలనీల్లో పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

Also Read: Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు