Kishan Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కబ్జాలు, అక్రమాలు, రౌడీయిజం, నేరాలు పెరిగిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పై విమర్శలు చేశారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన హైదరాబాద్ లో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను, నాయకులను, విలేకరులను ఈ రెండు పార్టీలు వేధించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో మహిళలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని, కేసీఆర్(KCR) కూడా గతంలో ఇలాగే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారన్నారు.
గల్లీలో తిరగాలని సవాల్..
మహానగరంలోని చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఖైరతాబాద్(Khairathabad), శేరిలింగంపల్లి, కూకట్ పల్లి(KukatPally), సనత్ నగర్(Sanathnagar) లా జూబ్లీహిల్స్ ను ఎందుకు కేసీఆర్, రేవంత్ అభివృద్ధి చేయలేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పాకే వారిని ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుని ఓట్లు అడగడం కాదని, దమ్ముంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం గల్లీలో తిరగాలని సవాల్ చేశారు. ఇక్కడి చెత్తకుప్పల్లో తిరుగుతూ ఓట్లు అడగాలన్నారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని ఫైరయ్యారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మజ్లిస్ కబంధ హస్తాల నుంచి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన విమర్శలు చేశారు. ఓటుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. ఇదిలా ఉండగా తొలుత హైదరాబాద్‌లోని కేఎంఐటీలో గోసేవా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రాంత గో విజ్ఞాన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకంటే ముందు నల్లకుంటలోని శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం దక్షిణామ్నాయ పీఠాధిపతి జగద్గురు విధు శేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
Also Read: Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!
