Illegal Liquor (imagecredit:swetcha)
క్రైమ్

Illegal Liquor: 125 బాటిళ్ల ప్రీమియం లిక్కర్.. జానీ వాకర్ మద్యం సీజ్.. ఎక్కడంటే..?

Illegal Liquor: స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎక్సయిజ్ సిబ్బంది మంగళవారం కూడా భారీ మొత్తంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను సీజ్ చేశారు. వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించటంతోపాటు దాడులు జరిపి 125 బాటిళ్ల ప్రీమియం లిక్కర్ తోపాటు జానీవాకర్ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు నాటుసారా తయారీలో ఉపయోగించే నల్ల బెల్లాన్ని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. వీటన్నింటి విలువ 14.56లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి(Rangareddy) ఎక్సయిజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్ సీఐలు సుభాష్​ చందర్​, బాలరాజులు సిబ్బందితో కలిసి శంషాబాద్ ప్రధాన రహదారిపై మంగళవారం వాహనాల తనిఖీలు జరిపారు.

125 ప్రీమియర్ లిక్కర్ బాటిళ్లు..

దీంట్లో గోవా నుంచి విమానాల్లో తీసుకొచ్చి కార్లలో తరలిస్తున్న 125 ప్రీమియర్ లిక్కర్ బాటిళ్ల(Liquor bottles)ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తీసుకొచ్చిన 15మందికి నోటీసులు ఇచ్చారు. ఈ మద్యం విలువ 7.50లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక, సీఐ నాగరాజు(CI Nagaraju) నేతృత్వంలోని బృందం ముషీరాబాద్ అచ్చయ్యనగర్ ఓ ఓ ఇంటిపై దాడి చేసి ఆరు జానీవాకర్ విస్కీ బాటిళ్లను సీజ్ చేశారు.

Also Read: Pawan Kalyan: ఓజీ రిలీజ్ సమయంలో తెర పైకి పవన్ డిజాస్టర్ మూవీ.. ఎక్కడో తేడా కొడుతోంది?

900కిలోల నల్ల బెల్లం పట్టివేత..

ఇక, నాటుసారా తయారీలో ఉపయోగించే నల్ల బెల్లాన్ని(Black jaggery) కూడా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి నాగర్​ కర్నూల్(Nagarkarnul) కు పెద్ద మొత్తంలో నల్ల బెల్లం రవాణా అవుతున్నట్టు అందిన సమాచారంతో స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం ఎస్​ఐ బాలరాజు సిబ్బందితో కలిసి తెలకపల్లి మండలం లింగాల గ్రామం వద్ద సిబ్బందితో కలిసి మాటు వేశారు. డీసీఎం వ్యాన్​ లో తరలిస్తున్న 900 కిలోల నల్ల బెల్లం, 50కిలోల అల్లంను సీజ్​ చేశారు. దీనిని తరలిస్తున్న మహర్షి, ఖాసీంలను అరెస్ట్ చేసి వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నల్ల బెల్లం, అల్లం విలువ దాదాపు అయిదు లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!