CM Jagan
క్రైమ్

కన్నబిడ్డ మృతదేహాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి.. ఇదేనా రాజన్న పాలనా?

కన్నబిడ్డ మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు చేతుల్లో మోసుకెళ్లిన ఘటన ఏపీలో కలకలం రేపుతున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు ఈ నెల 8న మరణించాడు. స్వగ్రామానికి అంబులెన్స్‌లో బయల్దేరారు. మృతుడి స్వస్థలం అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలో ఉన్నది. కానీ, అంబులెన్స్ దారి సరిగా లేదని వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో కొత్తయ్య తన కొడుకు డెడ్ బాడీని చేతుల్లో పట్టుకుని కొండ పైకి నడుచుకుంటూ వెళ్లాడు.

ఈ ఘటన పై స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. తమకు కనీసం సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆక్రోశించారు. కొత్తయ్య తన కొడుకు మృతదేహాన్ని మోసుకెళ్లుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై ఏపీ విపక్ష పార్టీలు స్పందించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!

అంబులెన్స్ వనిజ వద్ద దారి మధ్యలోనే కొత్తయ్యను వదిలిపెట్టి పోయిందని టీడీపీ పేర్కొంది. ఈశ్వరరావు మృతదేహాన్ని తండ్రి 8 కిలోమీటర్లు మోసుకెళ్లిన హృదయవిదారక దృశ్యాలు బాధాకరంగా ఉన్నాయని తెలిపింది. వైసీపీ ప్రభుత్వం ఫీడర్ అంబులెన్స్‌లను మూలన పడేసి బాధ్యతారాహిత్యంగా, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని ఫైర్ అయింది.

కాగా, వైఎస్ షర్మిల కూడా అన్న జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వేయండని అడిగేవాళ్లకు ఇది చూసైనా కనువిప్పు కలగాలి’ అని ఆగ్రహించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించారని, సరైన వైద్యం ఎలాగూ అందటం లేదని, కనీసం చనిపోయాక డెడ్ బాడీని కూడా ఇంటికి చేర్చకోలేని దురవస్థలో ప్రజలు ఉన్నారని, ఇది అధికార పార్టీకి సిగ్గుచేటని విమర్శించారు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇంకా రాజన్న వారసులం అని చెప్పుకుంటారని మండిపడ్డారు. రాజన్న పాలన ఇలానే ఉంటుందా? అని నిలదీశారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు