Viral Video : మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఆస్తుల కన్న బిడ్డలు, తల్లిదండ్రులను కూడా చిత్రహింసలు పెడుతూ.. చివరకు చంపేసే దాకా వస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు (Parents) అనే మమకారం కూడా ఉండకుండా పంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి దారుణమో హర్యానాలో (Haryana) చోటు చేసుకుంది. ఓ కూతురు ఆస్తికోసం తల్లిని దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురి చేసింది.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. హర్యానాలోని హిసార్ ఆజాద్ నగర్ కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్ గఢ్ కు దగ్గర్లోని విలేజ్ కు చెందిన సంజయ్ పునియాతో మ్యారేజ్ అయింది. భర్తకు రూపాయి సంపాదన లేదు. దాంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి ఆస్తుల కోసం ఇంట్లో వాళ్లను దారుణంగా హింసిస్తోంది. ఇప్పటికే కురుక్షేత్రలో తన తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులను అమ్మేసి రూ.65 లక్షల తన దగ్గర పెట్టుకుంది.
వాటితో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తోంది. అవి సరిపోవు అన్నట్టు తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదకు రాయాలంటూ నిత్యం తల్లిని వేధిస్తోందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజా వీడియోలో తన తల్లిని ఇష్టం వచ్చినట్టు నేలకేసి కొడుతూ.. తొడల మీద కొరుకుతూ సైకో లాగా ప్రవర్తిస్తోంది. తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ కొట్టొద్దని దండం పెట్టుకుని వేడుకున్నా సరే వినకుండా ఆమె కొడుతున్న తీరు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.
Read Also : ఫస్ట్ మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే 5 సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ !
Pz Help
Shocking video from HARYANA.Daughter torturing her own mother.#SaveSeniorCitizen @mlkhattar@cmohry @police_haryana #Vina2025 pic.twitter.com/WBaHstTTBK
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) February 27, 2025