Bhagyashri Borse
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: ఫస్ట్ మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే 5 సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ !

Tollywood: ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ అయితేనే ముందుకు వెళ్ళగలం. ఇక ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ని నిర్ధేశించేది సక్సెస్. ఈ పరిశ్రమకు ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చి కనుమరుగైన వారెందోరో ఉన్నారు. ఒక్క హిట్‌తో ఓవర్ నైట్ స్టార్‌గా మారి ఎక్కడికో వెళ్ళిపోయిన వారు చాలా మందే. అయితే ఒక హీరోయిన్‌కి మాత్రం ఫస్ట్ చిత్రం ప్లాప్ అయినప్పటికీ వరుస ఛాన్స్‌లతో దూసుకెళ్తోంది. ఏకంగా ఒకేసారి ఐదు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేసిందట. మొదటి మూవీ ప్లాప్ అయినప్పటికీ ఆమె అందం, అభినయంతో యువతను ఆకట్టుకుంది. హిందీలో రెండు మూవీస్‌లో నటించిన ఈ భామ తెలుగు స్టార్ హీరోతో చేసింది. తన నటనతో ఎంతో మంది మనుసులు దోచేసింది. ఆమె ఎవరో కాదు.. మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే(Bhagyashri Borse).

భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్లాప్ అయినప్పటికీ ఈ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్‌కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్ డమ్’లో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అయితే మొదట ఈ మూవీలో శ్రీలీల, రష్మిక మందన్న అనుకున్నారు, కానీ ఫైనల్‌గా భాగ్యశ్రీ భోర్సే‌ని ఫిక్స్ చేసారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి ఈ భామ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.

Bhagyashri Borse

Also Read: మల్టీప్లెక్స్‌లకు ఊరట.. ఆ ఆంక్షలు ఎత్తివేత

తాజాగా రానా దగ్గుబాటి నిర్మిస్తున్న ‘కాంతా’ అనే చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో సూర్య-డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీలో కూడా బ్యూటీ హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న బ్రహ్మా రాక్షస్‌లోనూ ఈ యంగ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆమె అందానికి ఫిదా అయిన దర్శక నిర్మాతలు వరుసగా ఛాన్స్‌లు ఇస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్స్ అన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాయి. మొత్తానికి 5 పాన్ ఇండియా చిత్రాలతో ఈ అమ్మడు బిజి బిజీగా ఉండబోతుంది. ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు