సూర్యాపేట స్వేచ్ఛ: Cyber Fraud Awareness: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మీనారాయణ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ స్కాం, ఇంపర్సోనేషన్, ఫేక్ ఐపిఎల్ టికెట్ బుకింగ్ వంటి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
సైబర్ అవగాహన దివాస్ సందర్భంగా జిల్లా పోలీస్ వ్యవస్థ అంతా సైబర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారన్నారు. సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండేందుకు వాట్సాప్ లో వచ్చిన ఏపీకే ఫైల్స్ ను ఇన్స్ టాలేషన్ చేసుకోకూడదని, లోన్ యాప్స్ లో లోన్ తీసుకోకూడదన్నారు.అలాగే క్రెడిట్ కార్డు మోసాలు, డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన పెంచుకోవాలన్నారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా cybercrime.gov.in ని సంప్రదించాలని, పోలీస్ సహాయం కోసం డయల్ 100 కు సమాచారం అందజేయాలన్నారు.
అనంతరం సూర్యాపేట టౌన్ ఎస్ఐ వి.ప్రవీణ్ స్మార్ట్ ఫోన్ ద్వారా జరిగే సైబర్ మోసాలను గురించి వివరించి వాటిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు , విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Ibrahimpatnam D Mart: చాక్లెట్ చోరీ అంటూ.. బాలుడి నిర్భంధం.. డీమార్ట్‌లో దారుణం..