Jawan Sucide: తీవ్ర మనస్థాపం, జీవితంపై విరక్తితో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో తన కుటుంబంపై చూపిన ప్రేమ, కుమార్తె భవిష్యత్తు గురించి చేసిన విజ్ఞప్తి స్థానికులను కంటతడి పెట్టించింది.
దసరా సెలవులకు వచ్చి..
మృతుడిని కాట్రపల్లి గ్రామానికి చెందిన పెరమండ్ల రాజ్ కుమార్ (38)గా గుర్తించారు. ఆయన జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దసరా సెలవుల నిమిత్తం ఇటీవల గ్రామానికి వచ్చిన రాజ్ కుమార్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత రెండు రోజులుగా రాజ్ కుమార్ మూడీగా, డిప్రెషన్‌తో ఉన్నట్లు ఆయన తల్లిదండ్రులు తెలిపారు.
కారణం ఎవరూ కారు..
ఆత్మహత్యకు ముందు రాజ్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ‘బతుకు మీద నాకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన తల్లిదండ్రుల బాధ్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్క బావలు.. తమ అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, తన రెండేళ్ల కూతురి భవిష్యత్తు గురించి రాస్తూ ‘నా బిడ్డను వాళ్ళ తల్లి, అమ్మమ్మల వద్ద ఉంచకుండా మా అమ్మానాన్నలే పెంచాలి’ అని కోరారు. తన మరణానికి ఎవరూ కారణం కారు అని స్పష్టం చేస్తూ తన మరణ వార్తను ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు.
Also Read: Telangana Govt: మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్.. పంట కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. సర్కారుపై రూ.2,400 కోట్ల భారం
గ్రామంలో విషాదఛాయలు
జవాన్ మృతితో కాట్రపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.యజేయాలని లేఖలో పేర్కొన్నారు. జవాన్ మృతితో కాట్రపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
