brs supremo again in radhakishan rao remand report Phone Tapping: రిమాండ్ రిపోర్టులో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో
Task Force Ex Osd Radhakishan Rao Reaveal The Secrets 
క్రైమ్

Phone Tapping: రిమాండ్ రిపోర్టులో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో

– నలుగురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతో నిఘా
– మూడేళ్లలో తొమ్మిది సార్లు డబ్బు పట్టివేత
– చిన్ననాటి మిత్రుడు వెంకట్రామిరెడ్డికి ఫుల్ సపోర్ట్
– ఎస్కార్ట్‌ ఇచ్చి మరీ డబ్బు సరఫరా
– రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో మరోసారి ‘బీఆర్ఎస్ సుప్రీమో’ ప్రస్తావన

Radhakishan Rao: రాధాకిషన్ రావు విచారణలో పోలీసులు కీలక వివరాలు తెలుసుకున్నారు. ఈ గ్యాంగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజా రిమాండ్ రిపోర్టులో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో ప్రత్యర్థుల డబ్బులను చాకచక్యంగా పట్టుకున్న ఘటనలను ఈ రిపోర్టులో పోలీసులు ఏకరువు పెట్టారు. మూడేళ్లలో 9 సార్లు డబ్బు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యర్థులకు డబ్బు చేరకుండా రాధాకిషన్ రావు అండ్ గ్యాంగ్ ప్లాన్లు వేసి అడ్డుకున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు వారి వివరాలను వింటూ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావు ఆదేశాలతో రాధాకిషన్ రావు సిబ్బందిని పంపి మరీ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతున్నాయనే ప్రతీ విషయాన్ని ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు చేరవేశారు. నలుగురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇచ్చిన ఆదేశాలతో రాధాకిషన్ రావు ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

మూడు ఉపఎన్నికల సందర్భంలో కోట్ల రూపాయాలను రాధాకిషన్ గ్యాంగ్ పట్టుకుంది. రాధాకిషన్ టాస్క్ ఫోర్స్‌ను అక్రమాలకు ఉపయోగించుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు డబ్బును పట్టుకున్నారు. 2018లో ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ. 70 లక్షలను రాధాకిషన్ టీమ్ పట్టుకుంది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో బేగంపేట వద్ద కోటి రూపాయాలను టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఆ డబ్బులు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీవని పోలీసులు తెలిపారు.

Also Read: Phone Tapping : డేంజర్‌లో ప్రభాకర్ రావు.. ప్రాణానికి ముప్పు ఉందా..?

2022 అక్టోబర్‌లో మునుగోడు ఉపఎన్నికల సమయంలో గాంధీ నగర్ వద్ద రూ. 3.50 కోట్ల రూపాయాలను టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఆ డబ్బులు అప్పుడు మునుగోడు నుంచి బీజేపీ టికెట్ పై బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివని పోలీసులు పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లో రూ. 3.35 కోట్ల రూపాయాలను పట్టుకోగా.. ఇవి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఏఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన మహేశ్ రెడ్డివని వివరించారు. అదే నెలలో తార్నాక వద్ద రూ. 22 లక్షలు, అదే రోజు మరో చోట రూ. 15 లక్షలను టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఇక భవానీ నగర్‌లో రాజకీయ నేత ముస్తఫా ఖాన్ నుంచి రూ. 1 కోటి పట్టుకుంది.

చిన్ననాటి మిత్రుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి రాధాకిషన్ రావు పూర్తిస్థాయిలో సహాయం చేసినట్టు తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను రవాణా చేశారు. వెంకట్రామిరెడ్డి డబ్బులనూ సరఫరా చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేయించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి నివాసానికి దగ్గరగా ఉండే శివచరణ్ రెడ్డి వద్ద డబ్బును ఎస్సై తీసుకెళ్లి సికింద్రాబాద్‌లో ఉండే మాజీ డీఎస్పీ దివ్య చరణ్‌కు ఆ డబ్బులు అందించారు. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండటానికి కొత్త సిమ్ కార్డు, ఐఫోన్ కొని ఎస్ఐకి రాధాకిషన్ రావు ఇచ్చారు. పలుమార్లు మొత్తంగా రూ. 4 కోట్ల డబ్బు తరలించినట్టు గుర్తించారు. డబ్బు రవాణాలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు కీలక పాత్ర పోషించారు.

Just In

01

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..