Medchal Crime: మేడ్చల్ బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం జరిగింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం అభ్యమైంది. అక్కడి స్థానికులు బ్యాగ్ నుండి దుర్వాసన వస్తుందని గ్రహించి సమాచారాన్ని స్ధానికులు పోలీసులకు అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అక్కడ జరిగిన సంగటనను పరిశీలించారు. చనిపోయిన మృతురాలు అందాజ 25 నుండి 35 సంవత్సరాలగా ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మహిళ మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ తో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు మృత దేహాన్ని గాంధీ హస్పెటల్ కు తరలించారు. జరిగిన సంఘటను బాల నగర్ జోన్ DCP సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఎర్పాటు చేసామిన తెలిపారు. మృతురాలి ఆచూకీ మరియు హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరేనా ఆ హత్యచేసిన వారు తెలిస్తే భాచులపల్లి పోలీసులకు తెలియచేయాలని పోలీసులు తెలిపారు.
Also Read: Covid-19 Cases India: కరోనా డేంజర్ బెల్స్.. ఏకంగా 4వేల కేసులు.. ఆందోళనలో ప్రభుత్వాలు!
పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు
ఇటీవల కాలంలో ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటలకు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుడిని ఐరన్ రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చగా తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య చేసిన నిందితులు పార్కులో గంజాయి సేవిస్తుండగా అపార్టుమెంట్ వాచ్ మెన్‌తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీయగా ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. దీంతో ఈ ఘటనలో వెంకటరమణ తీవ్రంగా గాయపడటంతో చనిపోయాడు.
Also Read: Actress Laya: బాలయ్య అంత పని చేశాడా? షాకింగ్ విషయం చెప్పిన నటి లయ!