Bike Theft Arrested: ఇద్దరు స్నేహితులు. సినిమా షూటింగుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. చేస్తున్న పని ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో నేరాల బాట పట్టారు. రోడ్డు పక్కగా షాపు ముందు ఎక్కడైనా బైక్(Bike) పార్క్ చేసి ఉంటే చాలు రెప్పపాటులో దానిని తస్కరిస్తూ ఉండాయించటం మొదలు పెట్టారు. ఇలా కొన్నిరోజుల వ్యవధిలోనే 13 ద్విచక్ర వాహనాలను అపహరించి చివరకు బంజారాహిల్స్ పోలీసు(Banjarahils Police)లకు పట్టుబడ్డారు. బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి(Venkat Reddy) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణానగర్ నివాసి నిమ్మతి శ్రీకాంత్ (32), ఉప్పల్ కు చెందిన నవీన్ (22) సినిమా షూటింగుల్లో కూలీలుగా పని చేస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే, విలాసవంతమైన జీవితంపై మక్కువతో ఇద్దరు కలిసి కొన్నాళ్లుగా బైకులను తస్కరించటం మొదలు పెట్టారు. ఇలా స్వల్ప వ్యవధిలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, గోపాలపురం, బోరబండ, మేడ్చల్, పేట్ బషీరాబాద్ స్టేషన్ల పరిధుల్లో నుంచి 13 వాహనాలను అపహరించారు.
Also Read: Electricity Department: రెగ్యులర్ ఉద్యోగులకు ఒక రూల్ ఆర్టీజన్లకు ఒక రూలా?
ఇలా చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను షేక్ ఖలీం అనే వ్యక్తికి అమ్ముతూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. కాగా, వీరి గురించి గాలింపు చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు పక్కాగా సమాచారాన్ని సేకరించి శ్రీకాంత్, నవీన్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.