Bachupally Crime: మేడ్చల్‌ల్లో ప్రియుడి పై మోజుతో భర్తను హత్య చేసిన భార్య గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంజిలప్ప(Anjilappa) (45) రాధ(Radha) వీరిద్దరు భార్య భర్తలు. మహబూబ్ నగర్(Mehabub Nagar) జిల్లా నారాయణ పేట్ మండలంలోని రామకృష్ణయ్యపల్లి విలేజ్‌కు చెందిన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మైగ్రెంట్ లేబర్‌గా హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలోని వజ్ర ప్రతీక్ కన్స్ట్రక్షన్ వద్ద పనిచేస్తూ లేబర్ గుడిసెలలో నివాసం ఉంటున్నారు. భార్య రాధ తరచుగా తన ప్రియుడితో ఫోన్(Phone)లో మాట్లాడుతూ ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే జూన్ 22 నాడు సాయంత్రం అంజలప్ప మద్యం సేవించి వజ్ర ప్రతీక్ గుడిసెల సముదాయంలోని తన నివాసానికి వచ్చాడు.
అంజలప్ప ఛాతిపై కూర్చుని బలంగా కొట్టి
ఈ సమయంలో భర్త అంజలప్ప, భార్య రాధకు గొడవ జరిగింది. భార్య, భర్తల గొడవను గమనించిన కాంట్రాక్టర్ వెంకటయ్య(Venkataiah) ఇద్దరి గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అంజలప్ప మద్యం మత్తులో ఉండడాన్ని గమనించిన భార్య రాధ అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో భర్త అంజలప్ప ఛాతి(Chest)పై కూర్చుని అతని ఛాతిపై బలంగా కొట్టి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు తన భర్త మద్యం అతిగా సేవించి మృతి చెందినట్లు తోటి కార్మికులను నమ్మించి భర్త మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు నారాయణపేట్ సమీపంలో గల రామకృష్ణయ్యపల్లి విలేజ్ కు తీసుకువెళ్ళింది.
Also Read: Sridhar Babu: ఏఐ మయంగా తెలంగాణ.. రెండేళ్లలో 2 లక్షల మంది నిపుణులు
మృతుడి గొంతుపై గాయాలు
అతిగా మద్యం తాగి తన భర్త చనిపోయాడని చెప్పి బంధువులను నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. అయితే మృతుడి గొంతుపై గాయాలు ఉండడం గమనించిన మృతుడి సోదరుడు నారాయణ పేట్(Narayana Pet) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నారాయణ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి హత్య జరిగిన స్థలం బాచుపల్లి(Bachupally) పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో బాచుపల్లి పీఎస్‌కు కేసు బదిలీ చేసి సమాచారం ఇచ్చారు. బాచుపల్లి పోలీసులు భార్య రాధను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తానే హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
Also Read: Medchal District: మురారిపల్లి ఇంటి నంబర్ల జారీలో మాయాజాలం