Infants Trafficking Case (image credit:twitter)
క్రైమ్

Infants Trafficking Case: మరీ ఇంత దారుణమా.. పసిబిడ్డలా.. అంగట్లో సరుకులా?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Infants Trafficking Case: నిరుపేద కుటుంబాలే ఆ గ్యాంగ్​ సభ్యుల టార్గెట్​. అసలే కష్టాల్లో ఉన్నారు.. పుట్టిన బిడ్ద ను ఎలా పెంచగలరు.. డబ్బిస్తాం మాకిచ్చేయండంటూ తల్లిదండ్రులకు ఆశ పెట్టి ఇంకా పూర్తిగా కళ్లు కూడా తెరవని పసికందులను అంగట్లో సరుకుగా మార్చేశారు. 50వేలు… లక్ష రూపాయలు లాభంగా పెట్టుకుని చిన్నారులను తెగనమ్ముకున్నారు. ఇలా నవజాత శిశువులను విక్రయిస్తున్న ఓ గ్యాంగును ఇటీవలే పట్టుకున్న రాచకొండ పోలీసులు విచారణలో వాళ్లు వెల్లడించిన వివరాల నేపథ్యంలో తాజాగా మరో 9మందిని అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో 10మంది పసికందులను రక్షించారు. రాచకొండ కమిషనర్​ సుధీర్​ బాబు ఎల్బీనగర్​ లోని క్యాంప్​ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కృష్ణవేణి అరెస్టుతో..
ఇటీవల చైతన్యపురి బస్టాప్​ వద్ద రోజుల బిడ్డను అమ్మటానికి ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ అధికారులు చైతన్యపురి పోలీసులతో కలిసి దాడి జరిపిన విషయం తెలిసిందే. బిడ్డను అమ్మటానికి ప్రయత్నించిన కోలా కృష్ణవేణి, దీప్తితోపాటు మరికొందరిని అరెస్ట్​ చేసి నలుగురు పసిబిడ్డలను కాపాడారు. విచారణలో గుజరాత్​ రాష్ట్రం అహమదాబాద్​ నివాసి వందన నిందితులకు పిల్లలను సమకూర్చినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ప్రత్యేక బృందం అహమదాబాద్​ వెళ్లి వందనను కూడా అరెస్ట్​ చేసి హైదరాబాద్​ తీసుకొచ్చింది. కోర్టులో హాజరు పరిచి జ్యుడిషియల్​ రిమాండ్ కు తర​లించింది.

కోర్టు అనుమతితో..

ఈ కేసులోని నిందితులు కృష్ణవేణి, దీప్తితోపాటు మరికొందరిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని నిశితంగా విచారించారు. దీంట్లో దిగ్ర్భాంతికర వివరాలు వెలుగు చూశాయి. మలక్ పేట వాస్తవ్యురాలైన అమూల్యతోపాటు ఇంకొందరితో కలిసి ఇరవై అయిదు మంది పసిపిల్లలను విక్రయించినట్టుగా వెల్లడైంది. ముంబయి, కాన్పూర్​, రాయ్​ పూర్​, హైదరాబాద్​ తోపాటు మహారాష్ర్టలోని అమరావతి ప్రాంతాల నుంచి పసిబిడ్డలను కొన్నట్టుగా తెలిసింది. ఇలా కొన్ని చిన్నారులను కోల్​ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​, గుంటూరు ప్రాంతాల్లో అమ్మినట్టుగా తెలియవచ్చింది.

Also Read: Greater Warangal: మాయమాటలతో బాలికల ట్రాప్.. ముఠా గుట్టురట్టు

ఆడ శిశువును 2 నుంచి 3 లక్షలకు కొని 3 నుంచి 4 లక్షలకు అమ్మినట్టుగా వెల్లడైంది. మగబిడ్డను 4 నుంచి 5 లక్షలకు కొని 6 లక్షల రూపాయలకు విక్రయించినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అమూల్యను అరెస్ట్​ చేశారు. ఆమెతోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మహారాష్​ట్ర వాసి వైశాలి భీమ్​ రావు వాస్నిక్​, హైదరాబాద్​ కొత్తపేట నివాసి జే.కార్తిక్​, ఘాన్సీబజార్ వాస్తవ్యుడు సజ్జన్​ అగర్వాల్​, అబ్దుల్లాపూర్​ మెట్​ కు చెందిన బానాల మంగయ్య, ఆసిఫాబాద్​ నివాసి బీ.నాగరాజు, నేరెడ్​ మెట్​ వినాయక్​ నగర్​ వాస్తవ్యుడు రామారం అశోక్​, మైలార్​ దేవుపల్లి శాస్త్రి పురం వాస్తవ్యుడు షేక్​ ఇస్మాయిల్​, నిజాంపేట నివాసి మాచర్ల వంశీకృష్ణలను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి సంతానం లేని 27మంది పసికందులను కొన్నట్టు విచారణలో వెల్లడైంది.

నిజానికి ఆశా వర్కర్​..

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అమూల్య ఆశా వర్కర్​ గా ఆజంపురాలోని యూపీహెచ్ సీలో ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం క్రితం మలక్​ పేట ఏరియా ఆస్పత్రిలో సూపర్​ వైజర్​ గా పని చేస్తున్న ఇస్మాయిల్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పుడే ఇస్మాయిల్​ పిల్లలు లేనివారు ఉంటే చెప్పమని అమూల్యతో చెప్పాడు. ఈ క్రమంలో చౌటుప్పల్​ లో ఉంటున్న తన బంధువు సుగుణమ్మకు పిల్లలు లేరని అమూల్య చెప్పింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ మగ శిశువును అమూల్య ద్వారా సుగుణమ్మకు విక్రయించాడు.

లాభంగా వచ్చిన 30వేల రూపాయలను అమూల్యతో కలిసి పంచుకున్నాడు. ఆ తరువాత అమూల్యకు చిన్నపిల్లలతో వ్యాపారం చేస్తున్న కృష్ణవేణి, దీప్తిలతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరితో కలిసి అమూల్య వేర్వేరు ప్రాంతాల నుంచి పసికందులను కొని వేర్వేరు చోట్ల ఉన్న వారికి విక్రయించింది. తాజాగా అమూల్య గ్యాంగును అరెస్ట్​ చేసిన పోలీసులు 10మంది పసికందులను రక్షించారు. మరో పదకొండు మందిని కాపాడాల్సి ఉందని కమిషనర్​ సుధీర్​ బాబు చెప్పారు.

Also Read: AP Crime: కన్న బిడ్డలనే కాలువలోకి తోసిన తండ్రి.. 7ఏళ్ల కూతురు మృతి.. ఏపీలో ఘటన

ఈ చిన్నారులను రక్షించటం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. సంతానం లేనివారు మధ్యవర్తుల ద్వారా పిల్లలను కొనవద్దని కమిషనర్​ చెప్పారు. చట్టప్రకారం పిల్లలను దత్తతకు తీసుకోవచ్చని తెలిపారు.

సిబ్బందికి అభినందనలు..క్యాష్​ రివార్డులు..

పొత్తిళ్లలోని బిడ్డలతో వ్యాపారం చేస్తున్న నిందితులను పట్టుకోవటంలో కీలకపాత్ర వహించిన ఎల్బీనగర్​ డీసీపీ ప్రవీణ్ కుమార్​, ఎస్వోటీ డీసీపీ రమణా రెడ్డి, అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి, సీఐలు జానయ్య, చంద్రశేఖర్​ రెడ్డి, ప్రవీణ్​ బాబు, జీ.వెంకటేశ్వరరావు, ఎస్సైలు భద్రయ్య, వాసుదేవ్​ పరమేశ్వర్​ లను కమిషనర్​ అభినందించారు. సిబ్బందికి నగదు రివార్డులు అందచేశారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ