Auto-Driver (Image source Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Auto Driver Theft: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆటో డ్రైవర్ సాయం.. కానీ రూ.10 లక్షలతో పరారీ

Auto driver theft: ఆటోడ్రైవర్ అరెస్ట్… మొత్తం రూ.5.31 లక్షలు నగదు రికవరీ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తికి సాయం చేసినట్టు చేసి చేసి ఏకంగా 10 లక్షల రూపాయలతో ఉడాయించిన ఆటోడ్రైవర్‌ను (Auto driver theft) కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.5.42 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్​ రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి, డీఐ కేఎస్ రవితో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీ నివాసి ఉత్తమ్ కుమార్ వర్మ ఈ నెల 7న తన కారులో ఇంటికి వెళుతూ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఉత్తమ్ కుమార్ వర్మకు గాయాలు అవ్వగా, కారు కూడా దెబ్బతిన్నది. ప్రమాదానికి గురైన కారు వెనుకాలే తన ఆటోలో వచ్చిన సూరారం నివాసి మాదావత్ శంకర్​ (26) గాయపడ్డ ఉత్తమ్​ కుమార్ వర్మను రోడ్డు పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశాడు.

Read Also- Bihar Election Results: ఇదేం ట్విస్ట్!.. బీహార్‌లో బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ

ఆ తరువాత తాడుతో కారును తన ఆటోకు కట్టి సనత్ నగర్‌లోని సెవెంత్ గేర్ ఆటోమోటీవ్ గ్యారేజీకి తీసుకెళ్లాడు. అనంతరం ఉత్తమ్ కుమార్ వర్మను ఆటోలో కూర్చోబెట్టుకుని అడ్డగుట్ట సొసైటీలోని అతడి ఇంటి వద్ద దింపాడు. అయితే, ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ వర్మ దృష్టి మరల్చిన మాదావత్ శంకర్ రూ.10 లక్షల నగదుతో ఉన్న అతడి బ్యాగును తస్కరించి ఉడాయించాడు. బ్యాగు కనిపించకపోవటంతో ఉత్తమ్​ కుమార్​ వర్మ ఫోన్​ చేయగా అది స్విచ్ఛాఫ్​ వచ్చింది. దాంతో జరిగిన విషయాన్ని వివరిస్తూ అతను కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన డీఎస్​ఐ అబ్దుల్​ సమద్, కానిస్టేబుళ్లు రాంచందర్, సురేశ్​, రఘురాంతో కలిసి విచారణ జరిపి శుక్రవారం నిందితున్ని అరెస్ట్ చేశారు. అప్పటికే మాదావత్ శంకర్ 4,69లక్షల నగదును ఖర్చు చేసుకున్నాడు. నిందితుని నుంచి మిగితా డబ్బుతోపాటు ఆటో, మొబైల్ ఫోన్లను సీజ్​ చేశారు.

Read Also- Globe Trotter event: ‘SSMB29’ ఈవెంట్ లోకేషన్ డ్రోన్ విజువల్ చూశారా.. పిచ్చెక్కుతుంది భయ్యా..

పోలీసు శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ పోలీసు శాఖలో 60 పోస్టులు భర్తీ చేయటానికి పోలీస్ రిక్రూట్​ మెంట్​ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్​ అసిస్టెంట్స్​, ల్యాబ్​ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డు ఛైర్మన్​ వీవీ.శ్రీనివాస రావు తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://www.tgprb.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Just In

01

Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?

Severe Cold Wave: హైదరాబాదీలకు వణుకుపుట్టించే అప్‌డేట్ ఇదీ.. రాబోయే 6 రోజులు తట్టుకోలేరు!

DGP Shivadhar Reddy: నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : డీజీపీ శివధర్ రెడ్డి

Auto Driver Theft: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆటో డ్రైవర్ సాయం.. కానీ రూ.10 లక్షలతో పరారీ

Bihar Election Results: ఇదేం ట్విస్ట్!.. బీహార్‌లో బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ