Attapur Crime: హైదరాబాద్‌లో దారుణం..తలపై రాళ్లతో కొట్టి.. బాలుడి హత్య
Attapur Crime(Image credit: Twitter)
క్రైమ్

Attapur Crime: హైదరాబాద్‌లో దారుణం..తలపై రాళ్లతో కొట్టి.. బాలుడి హత్య

Attapur Crime: హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని దుండగులు తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని మీరాలం ట్యాంక్ సమీపంలో పారవేశారు. ఈ సంఘటన స్థానికంగా కళకళ రేపింది. ఈ దారుణ హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి గుర్తింపు కోసం దర్యాప్తు చేపట్టారు. బాలుడు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, దుండగుల ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Also Read: వేధింపులు.. అవమానాలు.. చివరకు ఇల్లాలి సూసైడ్..

స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, బాలుడి గుర్తింపు, హత్య వెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉంది.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం