Atrocious, Private Bus Fares For Passengers
క్రైమ్

Private Bus: దారుణం, ప్రైవేట్ బస్సు మూలంగా ప్రయాణికుల పాట్లు

Atrocious, Private Bus Fares For Passengers: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. హైదరాబాద్‌ నుండి గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులంతా ఓం శ్రీ ట్రావెల్స్ అనే ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు డ్రైవర్‌ నిర్వాకం మూలంగా రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా ఈ బస్సులో ట్రావెల్‌ చేసే ప్రయాణికులందరిని ఒకే దగ్గరకు రావాలని ట్రావెల్స్ నిర్వాహకులు ఆదేశించారు. అసలు అయితే ఎల్‌బినగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా అందరిని మియాపూర్‌కి రావాలని బస్సు నిర్వాహకులు కోరారు. చేసేదేమి లేక అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఆ బస్సులో సౌకర్యాలు బాగా లేవని ప్రయాణికులు అడిగినందుకు ప్రయాణికుల పట్ల ట్రావెల్‌ బస్సు డ్రైవర్ కొంచెం కూడా గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించి ప్రయాణికులను బెదిరించాడు.

బెంగళూరుకు బయలుదేరింది బస్సు. ప్రయాణికులు తలా ఒక మాట అనడంతో కోపంతో మార్గమధ్యలో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం అశోక్ నగర్ వద్ద రోడ్డు మధ్యన ఆపి బస్సు దిగి డ్రైవర్ వెళ్లబోయాడు.దీంతో భయభ్రాంతులకు గురయిన ప్రయాణికులు 100 కు డయల్ చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు ఆ ప్రైవేట్ బస్సును పోలీసులు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద బస్సును విడిచిపెట్టి నాకేం సంబంధం లేదన్నట్లుగా డ్రైవర్ వెళ్లిపోయాడు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రాత్రంతా పిల్లా పాపలతో రోడ్డుపైనే గడిపారు.

Also Read: డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్

ఇండియన్ కొస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు వెళ్లాల్సిన చరణ్ వర్మ కూడా ఇందులో ఇరుక్కుపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ప్రయాణికులు శాంతించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!