Hyderabad Cyber Thugs Bid To Extort Money Using DGPs Pic:ప్రపంచమంతా టెక్నాలజీ వైపు వెళుతుందని సంతోషపడాలో, అదే టెక్నాలజీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని ఆందోళన చెందాలో అర్ధం కాని పరిస్థితి. ఎందుకంటే టెక్నాలజీలో ఆరితేరిన సైబర్ కేటుగాళ్లు అప్డేట్ అవుతూ రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సోషల్‌మీడియా వేదికగా జనాల్ని మోసం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సారి ఏకంగా తెలంగాణ డీజీపీకే ప్లాన్ వేశాడు సైబర్ నేరగాడు. డీజీపీ ఫొటోతో చీటింగ్‌కు పాల్పడ్డాడు. తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నాడు.
తాజాగా ఓ వ్యాపారవేత్త కూతురికి ఫోన్ బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ కాల్ చేసి డీజీపీ పేరుతో డ్రగ్స్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తామని డ్రగ్స్ నుండి తప్పించేందుకు 50వేల రూపాయలు డిమాండ్ చేశాడు అగంతకుడు. దీంతో అనుమానం వచ్చి వ్యాపారవేత్త చీటింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశాడు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారస్తుడికి +92 కోడ్‌తో వచ్చిన వాట్సాప్ కాల్ ఇది. ఈ నెంబర్‌ని పరిశీలించిన అనంతరం పాకిస్తాన్ కోడ్ అంటున్నారు సైబర్ పోలీసులు.
Also Read: రేవ్ పార్టీలో బడా సెలబ్రిటీలు
సోషల్ మీడియా వేదికగా ఫేస్‌బుక్‌లో నకిలీ పేర్లు, ఫొటోలతో మోసాలు జరుగుతున్నాయి. వీరు ఎక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇంకా వీరి ముఠాలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్ చాటింగ్‌లో ఉద్యోగాలు రావని, ఎవరు ఉద్యోగాలు ఇస్తామన్న అమాయకంగా నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ మోసాల గురించి ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా సరే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని హైదరాబాద్ సైబర్ పోలీసులు సూచించారు.