Vivo Smartphones: Vivo X300 Pro కెమెరా బీట్ చేస్తుందా?
vivo ( Image Source: Twitter)
బిజినెస్

Vivo Smartphones: Vivo X300 సిరీస్ బిగ్ లాంచ్.. ఫీచర్లు ఇవే!

Vivo Smartphones: వీవో తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Vivo X300, X300 Proలను భారత మార్కెట్లో డిసెంబర్ 2, 2025న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. లాంచ్‌కు ముందే బయటకు వచ్చిన లీక్‌లు ఈ రెండు మోడళ్ల ధరలు, ఫీచర్లు, పనితీరు వివరాలను స్పష్టంగా వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, వీవో ఈ సిరీస్‌ను పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్‌లో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. లీక్‌ల ప్రకారం, Vivo X300 బేస్ మోడల్ అయిన 12GB + 256GB వేరియంట్ ధరను రూ.75,999గా చెబుతున్నారు.

అదే ఫోన్ 12GB + 512GB వెర్షన్ రూ.81,999కు, 16GB + 512GB మోడల్ రూ.85,999కు అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు, X300 Pro ధర మాత్రం మరింత ఎత్తులో ఉండి, 16GB + 512GB వేరియంట్ ధర రూ.1,09,999 వరకు వెళ్లే అవకాశం ఉందని లీక్‌లు చెబుతున్నాయి.

Also Read: YS Jagan – Sunitha: నాంపల్లి కోర్టులో ఆసక్తికర సన్నివేశం.. జగన్‌కు ఎదురుపడ్డ సునీత.. తర్వాత ఏమైందంటే?

ఇక ఫోన్ల స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, వీవో ఈ సిరీస్‌లో MediaTek Dimensity 9500 అనే తాజా 3nm చిప్‌సెట్‌ను అందించనుంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి హెవీ పనుల్లోను శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందించగలదని అంచనా. Vivo X300 6.31 అంగుళాల LTPO OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.

Also Read: Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్.. ఆ సెంటిమెంట్ కోసమేనా..

ప్రో మోడల్ అయిన X300 Proలో 6.78 అంగుళాల 1.5K OLED ప్యానెల్ ఉండి అదే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కొనసాగిస్తుందని సమాచారం. Display విషయంలో వీవో గత కొన్నేళ్లుగా గణనీయమైన మెరుగుచేసే ప్రయత్నాలు చేస్తుండగా, X300 సిరీస్ కూడా అదే దిశగా మరో ముందడుగుగా కనిపిస్తోంది.

Also Read: Damodar Raja Narasimha: ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీపై కఠిన చర్యలు.. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి రాజనర్సింహ

బ్యాటరీ సామర్థ్యం కూడా ఈ సిరీస్‌లో ముఖ్యమైన హైలైట్. Vivo X300లో 6,040mAh భారీ బ్యాటరీను, Pro మోడల్‌లో 6,510mAh బ్యాటరీను అందించనున్నట్లు తెలుస్తోంది. రెండు మోడళ్లూ 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ ఛార్జింగ్ స్పీడ్‌లు, బ్యాటరీ కెపాసిటీలను పరిగణనలోకి తీసుకుంటే, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలున్నప్పటికీ రోజంతా హెవీ యూజ్‌తో కూడా ఫోన్‌లు సులభంగా ఉండే  అవకాశాలున్నాయి.

Just In

01

Upcoming Redmi Phones 2026: 2026లో భారత్‌ మార్కెట్లోకి రానున్న టాప్ 5 రెడ్‌మీ ఫోన్లు..

TTD Board: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. ప్రతీ భక్తుడు తెలుసుకోవాల్సిందే!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలో విచిత్రం.. చనిపోయిన వ్యక్తిని.. మెజారిటీతో గెలిపించిన గ్రామస్థులు

IPL Auction 2026: ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్

Viral video: చట్టసభలో ఉద్రిక్తత.. జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టుకొట్టుకున్న మహిళా ఎంపీలు