Post Office Schemes: ప్రస్తుత రోజుల్లో చాలామంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ (Post Office Schemes)లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెట్టిన పెట్టుబడికి ట్యాక్స్ మినహాయింపు లభిస్తుండటంతో చాలా మంది చూపు పోస్టాఫీసు పైన పడుతోంది. అంతేకాదు చిన్న చిన్న మెుత్తంలో డబ్బును దాచుకునే వెసులుబాటు ఉండటం, అధిక మెుత్తంలో వడ్డీని పొందటం వంటివి పోస్టాఫీసు స్కీమ్స్ లో ప్రధాన అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. అయితే పోస్టాఫీసులో పదుల సంఖ్యలో మనీ సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది బెటరో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అటువంటి వారి కోసం ఐదు టాప్ స్కీమ్స్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో డబ్బును పొదుపు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ (Post Office Time Deposit Scheme)
ఇది పోస్టాఫీసు తీసుకొచ్చిన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం. 1, 2, 3, లేదా 5 సంవత్సరాల కాలవ్యవధితో అందుబాటులో ఉంది. కనిష్ట పెట్టుబడి రూ.1000 రూపాయల నుంచి ఎంతైన ఫిక్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు 6.9% (తొలి ఏడాది), రెండేళ్లకు 7.0%, 3 ఏళ్లకు 7.0%, 5 ఏళ్లకు 7.5%గా నిర్ణయించారు. 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కాలవ్యవధి ముగిసిన తర్వాత డిపాజిట్ టైమ్ ను మరింత పొడింగించుకునే సౌలభ్యం కూడా ఉంది.
2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate – NSC)
ఇది 5 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన పొదుపు పథకం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1000 నుంచి ఎంతైన పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ కింద పొదుపు చేసిన డబ్బుకు 7.7% వడ్డీని పోస్టాఫీసు అందించనుంది. పొదుపు కాలం పూర్తైన ఐదేళ్ల తర్వాత అసలుతోపాటు వడ్డీని కూడా తిరిగి చెల్లిస్తారు. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
3. పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (Post Office Monthly Income Scheme – POMIS)
నెలవారీ స్థిర ఆదాయం కోరుకునేవారికి ఈ పథకం అనువైనది. 5 సంవత్సరాల కాల వ్యవధిని ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. వ్యక్తిగత ఖాతా అయితే రూ.9 లక్షలు, జాయింట్ ఖాతా అయితే రూ.15 లక్షల వరకూ గరిష్ట పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ ద్వారా అసలుకు 7.4% వడ్డీని నెలవారీగా చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.3,083 వడ్డీ లభిస్తుంది. రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.5,550 వడ్డీ రూపేణా లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ పై పన్ను మినహాయింపు లేదు. రిటైరైన ఉద్యోగులు, గృహిణులకు ఈ స్కీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme – SCSS)
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల కోసం ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. 5 సంవత్సరాలను కాల వ్యవధిగా నిర్ణయించారు. స్కీమ్ కింద కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డి రేటు 8.2% (త్రైమాసిక చెల్లింపు)గా ఉంది. ఈ స్కీమ్ పెట్టుబడిపై సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించనుంది. 5 సంవత్సరాల తర్వాత మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. స్థిర ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు SCSS స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: IPL 2025 Final: మరికొద్ది గంటల్లో ఫైనల్స్.. గెలిచేదెవరు.. ఇంటికెళ్లేది ఎవరు..?
5. సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana – SSY)
ఆడ పిల్లల కోసం పోస్టాఫీసు తీసుకొచ్చిన ప్రముఖ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన టాప్ లో ఉంది. 10 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లల కోసం దీనిని రూపొందించారు. వారి చదువు, పెద్దయ్యాక పెళ్లికి కావాల్సిన ఆర్థిక భద్రతను ఈ స్కీమ్ అందిస్తుంది. 15 ఏళ్ల కాలానికి ఏటా కొంత మెుత్తంలో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.250 నుంచి గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షల వరకూ ఎంతైన ఆడపిల్ల పేరున డిపాజిట్ చేయవచ్చు. 8.2% వడ్డీ లభించనుంది. బాలికకు 21 సంవత్సరాలు పూర్తి కాగానే అసలుకు వడ్డీ కలిపి పోస్టాఫీసు తిరిగి చెల్లిస్తుంది. 18 ఏళ్ల తర్వాత ఆడపిల్ల చదువు/పెళ్లి కోసం 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు