Tata Motors: టాటా కమర్షియల్ వెహికల్స్ Q2 FY26 రిపోర్ట్
Tata Motors ( Image Source: Twitter)
బిజినెస్

Tata Motors: టాటా మోటార్స్‌కి మరో పెద్ద దెబ్బ.. 867 కోట్లు నష్టం

Tata Motors: టాటా మోటార్స్ లిమిటెడ్ (కమర్షియల్ వెహికల్స్ విభాగం) గురువారం ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు (Q2 FY26) ఆశ్చర్యం కలిగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసికం (Q2 FY26)లో సంస్థ రూ.867 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. డీమెర్జర్ తర్వాత వాణిజ్య వాహన విభాగాన్ని మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న టాటా మోటార్స్‌ రిలీజ్ చేసిన ఇదే తొలి త్రైమాసిక ఫలితాలు. గతేడాది ఇదే సమయంలో (Q2 FY25) కంపెనీ రూ.498 కోట్ల లాభాల్లో ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళింది.

రెవెన్యూ పెరిగినా ఖర్చులు భారం

అయితే, ఆపరేషన్స్ నుంచి ఆదాయం 6 శాతం పెరిగి రూ.18,585 కోట్లకు చేరింది. (గతేడాది రూ.17,535 కోట్లు). కానీ మొత్తం ఖర్చులు 15 రూ.19,296 కోట్లకు ఎగబాకాయి (గతేడాది రూ.16,777 కోట్లు). మెటీరియల్ ఖర్చులు పెరగడం, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ.2,027 కోట్ల వన్-టైమ్ ఫెయిర్ వాల్యూ లాస్ – ఇవే నష్టాలకు ప్రధాన కారణాలు. ఈ లాస్ వల్ల నెట్ లాస్ రూ.900 కోట్లుగా నమోదైంది. ఎక్సెప్షనల్ ఐటెమ్స్ మినహాయిస్తే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ రూ.600 కోట్లు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ.1,397 కోట్ల లాభం సాధించిన కంపెనీ ఇప్పుడు నష్టంలో పడింది.

ఖర్చులు 15% పెరగడంతో నష్టాల్లోకి..

టాటా మోటార్స్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయాలు 15% పెరిగి రూ.19,296 కోట్లకు చేరాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో ఖర్చులు రూ.16,777 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి వ్యయభారం భారీగా పెరగడం త్రైమాసిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది.

నష్టాలకు ప్రధాన కారణాలివే..

మెటీరియల్ వ్యయాలు భారీగా పెరగడం, ఈ త్రైమాసికంలో ముడి పదార్థాల ఖర్చులు గణనీయంగా పెరగడంతో కంపెనీ వ్యయభారం అధికమైంది. ఈక్విటీ పెట్టుబడులపై రూ.2,027 కోట్ల భారీ ఫెయిర్ వ్యాల్యూ నష్టం నమోదైంది. ఒక్కసారిగా వచ్చిన లాస్‌ కంపెనీ లాభాలను నేరుగా ప్రభావితం చేసి, త్రైమాసిక ఫలితాలను నష్టాల్లోకి నెట్టింది.

Just In

01

Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?