Digital Payments: పెరూ ప్రభుత్వం వచ్చే ఏడాదిలోపే భారతదేశం అభివృద్ధి చేసిన యూపీఐ విధానం తరహాలో రియల్‌టైమ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. పెరూవియన్ అంబాసడర్ జేవియర్ మానుయెల్ పౌలినిచ్ వెలార్డే ఈ విషయాన్ని వెల్లడించారు. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), పెరూ సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (BCRP) ఇప్పటికే 2024లో ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే, యూపీఐ ఆధారిత పేమెంట్ టెక్నాలజీని దత్తత తీసుకున్న తొలి దక్షిణ అమెరికా దేశంగా పెరూ నిలవనుంది. “ఇది చాలా క్లిష్టమైన వ్యవస్థ. ఇందుకోసం అనేక నిపుణుల బృందాలు పెరూకు వచ్చాయి. మేము వచ్చే ఏడాదిలోపే అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం,” అని అంబాసడర్ పౌలినిచ్ తెలిపారు.
అంబాసడర్ యూపీఐని “అద్భుతమైన ఆర్థిక సాధనం”గా చెబుతూ, పెరూ ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పెరగడంలో కీలకంగా పని చేస్తుందని చెప్పారు. ఈ యూపీఐ-లాంటి సిస్టమ్ ద్వారా వ్యక్తుల మధ్య, వ్యాపారాలను చేరువ చేసే విధంగా డిజిటల్ లావాదేవీలు జరగనున్నాయి. అలాగే బ్యాంకింగ్ సౌకర్యాలు లేని జనాభా కూడా డిజిటల్ పేమెంట్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: Tirumala News: తిరుమల భక్తులు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయాలు..!
గత కొన్నేళ్లుగా భారత్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో యూపీఐ పేమెంట్స్ టెక్నాలజీతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూపీఐ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగిన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఒకటి. రోజుకు బిలియన్‌కు పైగా లావాదేవీలు నిర్వహిస్తూ, భారతదేశాన్ని వేగవంతమైన, తక్కువ ఖర్చుతో, భద్రమైన డిజిటల్ చెల్లింపుల్లో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టింది.
