Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దాంతో మదుపర్ల సంపద ఆవిరి అయిపోయింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు మిగుల్చాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1380 పాయింట్లు తగ్గింది. అటు నిఫ్టీ కూడా 275 పాయింట్లు తగ్గి 22300 పాయింట్ల వద్ద ఆగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. బ్యాంకింగ్ లో నిఫ్టీ, ఐటీ స్టాక్స్ లో ఒత్తిడి బాగా పెరిగింది. అందుకే ఇవి భారీగా నష్టపోయాయని తెలుస్తోంది. నిఫ్టీలో టాటా (Tata) స్టీల్, టెక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, ఎన్ టీపీసీ జేఎస్ డబ్ల్యూ లాంటివి భారీగా నష్టపోయాయి.
అయితే బంగారం షేర్లు మాత్రం లాభపడ్డాయి. కోల్ ఇండియా భారీగా లాభపడింది. ఇంత భారీగా స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే. రీసెంట్ గానే ఆయన టారిఫ్ ప్రకటనలు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా చైనా మీద కూడా 25 శాతం ట్యాక్స్ విధించారు. ఇవి కూడా అదే రోజు నుంచే అమలవుతాయని స్పష్టం చేశారు.
అటు ఈయూ మీద కూడా కొత్త పన్నులు విధిస్తున్నారు. దాంతో పెట్టుబడులు పెట్టే వాళ్లు పూర్తిగా వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే మార్కెట్ సూచీలు పతనం అయిపోయాయి. ఇండియాలో టాటా స్టీల్, జియో, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, టీసీఎస్ షేర్లు భారీగా పడిపోయాయి.