Gold Rates (30-06-2025): నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?
Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (30-06-2025): గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

Gold Rates (30-06-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.

పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,260 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు తగ్గడంతో  మహిళలు బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 కి తగ్గి రూ.97,260 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 కి తగ్గి రూ.89,150 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,150

విజయవాడ ( Vijayawada) – రూ.89,150

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,150

వరంగల్ ( warangal ) – రూ.89,150

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.97,260

వరంగల్ ( warangal ) – రూ.97,260

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.97,260

విజయవాడ – రూ.97,260

వెండి ధరలు

గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.11,700 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,17,700 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,17,700

విశాఖపట్టణం – రూ.1,17,700

హైదరాబాద్ – రూ.1,17,700

వరంగల్ – రూ.1,17,700

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?

Hyderabad Crime: పహాడీషరీఫ్‌లో మైనర్‌పై అత్యాచారం.. బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి!

India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు

Hyderabad Crime: భర్తతో గొడవ.. ఏడేళ్ల కూతుర్ని హత్య చేసిన కన్నతల్లి

Google Dark Web Report: కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్.. డార్క్ వెబ్ మానిటరింగ్‌కు బ్రేక్