Gold Rate Today
బిజినెస్

Gold Rate Today: ఉమెన్స్ డే రోజునా కరుణించని బంగారం.. భారీగా పెరిగిన ధరలు

Gold Rate Today: పసిడిని మహిళలు ఎంతగా ఇష్టపడతారో అందరికీ తెలిసిందే. ఆభరణాలు ధరించి నలుగురిలో ఎంతో సౌందర్యవంతంగా కనిపించడానికి వారు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బిగ్ షాక్ తగిలింది. శుక్రవారంతో పోలిస్తే పసిడి ధరలు భారీగా పెరిగాయి.

ఎంత పెరిగిందంటే

దేశంలో బంగారం ధరలు శనివారం (మార్చి 8) భారీగా పెరిగాయి. శుక్రవారం రూ.79,900 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రోజు వ్యవధిలో రూ.500 పెరిగింది. తద్వారా రూ. 80,400కు చేరుకుంది. అటు 24 క్యారెట్ల బంగారం ధర సైతం పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ను రూ.87,160 విక్రయించారు. శనివారం రూ.550 పెరగడంతో నాణ్యమైన 10 గ్రాముల గోల్డ్ ను రూ.87,710లకు అమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 80,040గా ఉంది. 24 క్యారెట్ల బంగారాన్ని రూ.87,710లకు విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో హైదరాబాద్ తరహాలోనే పసిడి ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.80,040 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ను రూ.87,710లకు సేల్ చేస్తున్నారు. వైజాగ్ లో సైతం పసిడిని రూ.80,040 (22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్), రూ.87,710 (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్) ధరలకు విక్రయిస్తున్నారు.

సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే

ప్రస్తుతం దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.1,08,100 గా ఉంది. విజయవాడ, వైజాగ్ లోనూ కేజీ వెండిని రూ.1,08,100 ధరకే విక్రయిస్తున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంది. అక్కడ కిలో సిల్వర్ రూ. 99,100గా పలుకుతోంది. ముంబయి, బెంగళూరు, కోల్ కత్తా, పూణె వంటి నగరాల్లోనూ వెండిని ఢిల్లీ ధరతోనే విక్రయిస్తున్నారు.

Also Read: PM Modi Womens Day: ఉమెన్స్ డే రోజున ప్రధాని సంచలన నిర్ణయం.. మహిళలకే బాధ్యతలు!

పెట్రోలు, డీజిల్ ధరలు..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంటే.. డీజిల్​ ధర రూ.96.16 పలుకుతోంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం