Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Rates ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 25, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల తగ్గిన ధరలపై ఆశ పెట్టుకున్న కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు కొంత భారంగా మారుతోంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 25, 2025)

డిసెంబర్ 24 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,39,250
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,650
వెండి (1 కిలో): రూ.2,45,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,39,250
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,650
వెండి (1 కిలో): రూ.2,45,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,39,250
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,650
వెండి (1 కిలో): రూ.2,45,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,39,250
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,650
వెండి (1 కిలో): రూ.2,45,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,44,000 గా ఉండగా, రూ.1000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,45,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం:రూ.2,45,000
వరంగల్: రూ.2,45,000
హైదరాబాద్:రూ.2,45,000
విజయవాడ: రూ.2,45,000

Just In

01

School Bus Accident: మరో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. 60 మందికి పైగా విద్యార్థులు..!

Akhanda 2 JajiKayi Song: బాలయ్య బాబు ‘అఖండ 2’ నుంచి ‘జాజికాయ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

Hydraa: పతంగుల పండగకు.. చెరువులను సిద్ధం చేయాలి.. హైడ్రా కమిషనర్ ఆదేశాలు

Anasuya Bharadwaj: వివక్షపై మరోసారి గళం విప్పిన అనసూయ.. “నా ఉనికిని తక్కువ చేసే ప్రయత్నం చేయకండి”

iPhone Auction: తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం.. బెంగళూరులో భారీ గ్యాడ్జెట్ వేలం