Gold Rate ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: మళ్ళీ పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా పెరగడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని అయోమయంలో పడ్డారు. ఈ రోజు ధరలు పెరిగాయి. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” అబ్బా, ఇప్పుడేం కొంటాము.. వద్దు!” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 03, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 03, 2025)

నవంబర్ 02 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,68,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,68,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,68,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,900
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,170
వెండి (1 కిలో): రూ.1,68,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,66,000 గా ఉండగా, రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.1,68,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,68,000
వరంగల్: రూ.1,68,000
హైదరాబాద్: రూ.1,68,000
విజయవాడ: రూ.1,68,000

Just In

01

Mahesh Kumar Goud: బీసీలు ఏకం కారని ఆ రెండు పార్టీలు నమ్ముతున్నాయి: మహేష్ కుమార్ గౌడ్

Chevella Bus Accident: మరో సంచలనం.. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌పై.. హైదరాబాద్‌లో చలాన్లు!

Dheekshith Shetty: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో ఎందుకు చేశానంటే..?

Air India crash: ఎయిరిండియా క్రాష్‌లో బతికిన ఏకైక ప్యాసింజర్ ప్రవర్తనలో అనూహ్య మార్పు.. భార్య, కొడుకుతో..

Harassment Case: అసభ్యకరంగా మహిళను వేధిస్తున్న కీచక డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడంటే..?