Gold Rate (18-06-2025): బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
Gold Rate ( 18-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate (18-06-2025): బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Rate ( 18-06-2025): తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.1,00,910  గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

నిన్నటి మీద పోలిస్తే.. రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) మళ్లీ పెరగడంతో మహిళలు బంగారం కొనాలన్న కూడా ఆలోచిస్తున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.540 పెరిగి రూ. 1,00,910 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 కు పెరిగి రూ.92,500 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,21,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.92,500

విజయవాడ ( Vijayawada) – రూ.92,500

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.92,500

వరంగల్ ( warangal ) – రూ.92,500

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.1,00,910

వరంగల్ ( warangal ) – రూ. 1,00,910

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 1,00,910

విజయవాడ – రూ. 1,00,910

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.15,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,21,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,21,000

విశాఖపట్టణం – రూ.1,21,000

హైదరాబాద్ – రూ.1,21,000

వరంగల్ – రూ.1,21,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ramchander Rao: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు? రాంచందర్ రావు తీవ్ర విమర్శ!

Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!

Aadi Srinivas Slams KTR: కేవలం 175 ఓట్ల తేడాతో 2009లో గెలిచావ్.. కేటీఆర్ కామెంట్స్‌కు ఆది స్ట్రాంగ్ కౌంటర్!

Fake Death Scam: హోమ్ లోన్ తీర్చేందుకు నకిలీ మరణం.. ప్రేయసి చాట్స్‌తో బయటపడ్డ మోసం

Hydra: ప్రజావాణికి 46 ఫిర్యాదులు.. కబ్జాలపైనే ఎక్కువగా ఆర్జీలు!