Ducati multistrada v2 ( Image Source: Twitter)
బిజినెస్

New Ducati Multistrada V2: భారత మార్కెట్‌లోకి డుకాటి మల్టీస్ట్రాడా V2 బైక్‌.. ఫీచర్లు ఇవే!

New Ducati Multistrada V2: ప్రతి అబ్బాయికి ఒక కల ఉంటుంది. మంచి జాబ్ తెచ్చుకుని ఒక బైక్ కొనుక్కోవాలని. వారి కోసం టెక్ కంపెనీలు కూడా కొత్త బైక్ బైక్ లను మార్కెట్ లో కి తెస్తారు. అయితే, తాజాగా మార్కెట్లోకి వచ్చిన రెండు కొత్త బైక్ లు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి అడ్వెంచర్ టూరింగ్, సూపర్‌స్పోర్ట్ సెగ్మెంట్‌లో గేమ్ చేంజర్స్. ఇక్కడ వాటి మోడల్స్, డిజైన్, ధరలు, ఫీచర్స్ గురించి వివరంగా చూద్దాం.

ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీదారు డుకాటీ తన లేటెస్ట్ జనరేషన్ అడ్వెంచర్ టూరర్ మల్టీస్ట్రాడా V2, V2S మోడళ్లను భారత్‌లో కూడా అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైకుల ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.18.88 లక్షల నుంచి రూ.21.30 లక్షల వరకు ఉన్నాయి. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ బరువు తక్కువగా ఉంది. ఇది రిఫైన్డ్ డిజైన్‌తో వచ్చింది.

బరువు తక్కువ ఫ్యూయల్ ట్యాంక్ కూడా చిన్నగా

మల్టీస్ట్రాడా V2: ఫ్యూయల్ లేకుండా 199 కేజీలు
మల్టీస్ట్రాడా V2S: 202 కేజీలు

ఈ బరువు తగ్గింపుకు ప్రధాన కారణం 19 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ (పాత మోడల్‌లో 20 లీటర్లు). ఇది బైక్‌ను మరింత హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని తెలిపారు.

Also Read: Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్

డుకాటి కొత్త మల్టీస్ట్రాడా V2 ధరలు 

డుకాటి కొత్త మల్టీస్ట్రాడా V2 బైక్‌ భారత్‌లో మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి మోడల్‌ ప్రత్యేక రంగు, ఫీచర్లతో వస్తోంది.

డుకాటీ మల్టీస్ట్రాడా V2 డుకాటీ రెడ్ కలర్ బైక్ మార్కెట్ ధర 18,88,000 గా ఉంది.
డుకాటీ మల్టీస్ట్రాడా V2S డుకాటీ రెడ్ కలర్ బైక్ మార్కెట్ ధర 20,99,800 గా ఉంది.
డుకాటీ మల్టీస్ట్రాడా V2S స్టార్మ్ గ్రీన్ కలర్ బైక్ మార్కెట్ ధర 21,29,700 గా ఉంది.

ఈ బైక్‌లు తమ ఆకర్షణీయమైన డిజైన్‌తో రోడ్డుపైనే కాదు, చూపులపై కూడా అందంగా కనిపిస్తుంది. పానిగేల్, మల్టీస్ట్రాడా V4 మోడళ్ల నుండి ప్రేరణ పొందిన కొత్త ఫ్రంట్ లుక్, స్పోర్టీ హెడ్‌లైట్స్, DRLలు, అలాగే స్లీక్ సైలెన్సర్ డిజైన్ బైక్‌కు మరింత ప్రీమియమ్ లుక్‌ను అందిస్తున్నాయి.

Also Read: Smartphones Under rs 30000: రూ.30 వేలలో టాప్ కెమెరా ఫోన్లు.. ఐఫోన్ రేంజ్ క్వాలిటీ.. ఫొటోలు, ఇన్‌స్టా రీల్స్‌కు బెస్ట్ ఛాయిస్!

పవర్‌ఫుల్ ఇంజిన్‌,  అద్భుత ఫీచర్లు

కొత్త డుకాటి మల్టీస్ట్రాడా V2 బైక్‌ శక్తివంతమైన 890cc V-ట్విన్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్‌ గరిష్టంగా 115 హెచ్‌పి పవర్‌ను 10,750 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. టార్క్‌ పరంగా ఇది 92 Nm @ 8,250 rpm ను అందిస్తుంది. బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, అలాగే బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ సదుపాయాలు ఉన్నాయి, ఇవి గేర్ మార్పును మరింత స్మూత్‌గా, వేగంగా చేస్తాయి.

V2 S ఎడిషన్ ప్రత్యేక ఫీచర్లు

డుకాటి స్కైహూక్ సస్పెన్షన్ (DSS): ఇది సెమీ-యాక్టివ్ సిస్టమ్‌; రోడ్ పరిస్థితులను బట్టి ఆటోమేటిక్‌గా డ్యాంపింగ్‌ను సర్దుబాటు చేస్తుంది.

మినిమమ్ ప్రీలోడ్ ఫంక్షన్: ఒక బటన్ నొక్కగానే రియర్ సస్పెన్షన్‌ తక్కువ ఎత్తుకు తగ్గుతుంది, దీని వల్ల సిటీ రైడింగ్‌లో సౌకర్యం పెరుగుతుంది.

కొత్త మోనోకోక్ ఫ్రంట్ ఫ్రేమ్: ఇది బైక్‌కు మెరుగైన రిజిడిటీతో పాటు అద్భుతమైన హ్యాండ్లింగ్ పనితీరును ఇస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కొత్త డుకాటి మోడల్‌ పవర్, కంఫర్ట్‌, కంట్రోల్‌ను సమానంగా అందించేలా రూపుదిద్దుకుంది.

Just In

01

Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్

Kia Carens: కియా క్యారెన్స్‌ ఇప్పుడు CNG వెర్షన్‌లో లాంచ్‌.. మైలేజ్‌, ధర, ఫీచర్లపై ఫుల్ డీటెయిల్స్!

Pawan Kalyan: ‘ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..

Jubilee Hills By Election: ఇక మిగిలింది మూడు రోజులే.. ప్రధాన పార్టీల అభ్యర్థుల వెనుక షాడో టీమ్స్..!