Centre on GST (Image Source: Twitter)
బిజినెస్

Centre on GST: దీపావళి బొనాంజా ఫిక్స్.. ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు.. భారీగా తగ్గనున్న ధరలు!

Centre on GST: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో రెండు రేట్ల (5%, 18%) విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. స్టాండర్డ్‌ (ప్రామాణిక), మెరిట్‌ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు కేంద్రం నివేదించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్‌టీ కౌన్సిల్‌ ముందు ప్యానెల్‌ తన సిఫారసులు ఉంచననున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇక దేశంలోని అన్ని వస్తు సేవలు రెండు శ్లాబుల జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.

శ్లాబుల సర్దుబాటు ఎలాగంటే?
ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో భాగంగా ఎర్రకోట నుంచి త్వరలో చేపట్టబోయే జీఎస్టీ సంస్కరణల గురించి ప్రస్తావించారు. ఈసారి దేశ ప్రజలకు దీపావాళి బొనాంజా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ సైతం జీఎస్టీ సంస్కరణ దిశగా అడుగులు ప్రారంభించింది. జీఎస్టీలో ప్రస్తుమున్న 5% 12%, 18%, 28% శాబుల్లో రెండింటిని ఎత్తివేసి.. 5%, 18% మాత్రమే ఉంచాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ కు ప్రతిపాదనలు పంపింది. వాటి ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 28% స్లాబ్‌లోని 90% వస్తువులు 18% స్లాబ్‌కి మార్చబడతాయి. 12% స్లాబ్‌లోని 99% వస్తువులు 5% స్లాబ్‌కి మారతాయి.

పెట్రోల్, డీజిల్ పరిస్థితేంటి?
అయితే లగ్జరీ వస్తువులు పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి వాటిపై ప్రత్యేకంగా 40% పన్ను విధించే అవకాశముంది. 40 శాతం పన్ను పరిధిలో కేవలం 5–7 వస్తువులు మాత్రమే ఉండనున్నాయి. ఫ్రిజ్, ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులకు అందులో చోటు ఉండదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వజ్రాలు, విలువైన రాళ్లు వంటి అధిక శ్రమ ఆధారిత, ఎగుమతి ఆధారిత రంగాలు ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లకే లోబడి కొనసాగుతాయి.

ప్రభుత్వ లెక్కలు
మొత్తం జీఎస్టీ ఆదాయంలో 67% వసూళ్లు 18% స్లాబ్ నుంచి వస్తున్నాయి. 28% స్లాబ్ నుంచి 11%, 12% స్లాబ్ నుంచి 5%, 5% స్లాబ్ నుంచి 7% ఆదాయం వస్తోంది. రెండు శ్లాబుల విధానం అమలైనప్పటికీ పన్ను ఆదాయం 88% పడిపోవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి. కానీ వినియోగం పెరగడం ద్వారా ఆదాయం లోటు భర్తీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎవరికి ప్రయోజనం?
రెండు శ్లాబుల జీఎస్టీ విధానం వల్ల పలు రంగాల వారికి ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు లాభం చేకూరుతుందని అంటున్నారు. మరోవైపు బంగారంపై 3 శాతం స్పెషల్ సెస్సును కేంద్రం వసూలు చేస్తోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేదా 5 శాతం పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్రాలకు జీఎస్టీ సంస్కరణల వల్ల ఆదాయం తగ్గితే కేంద్రం దానిని ఏ విధంగా భర్తీ చేస్తుందన్నది కూడా చూడాలి.

తుది నిర్ణయం ఎప్పుడంటే?
ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా జీఎస్టీ సంస్కరణ గురించి మాట్లాడారు. ‘డబుల్ దీపావళి’ కోసం జీఎస్టీ రిఫార్మ్స్ వస్తాయని చెప్పారు. సాధారణ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా పన్ను రేట్ల సరళీకరణ ఉంటుందని పేర్కొన్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ (రాష్ట్ర ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నది) సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సమావేశమై ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Alaska Summit: అలాస్కా భేటి అట్టర్ ఫ్లాప్.. కుదరని ఏకాభిప్రాయం.. ట్రంప్, పుతిన్ ఏమన్నారంటే?

నిపుణుల అభిప్రాయం
జీఎస్టీ నిపుణుడు, ఆర్థికవేత్త వేద్ జైన్ మాట్లాడుతూ ‘ఈ ప్రతిపాదన అమలైతే నిత్యవసర వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గుతుంది. వాటి ధరలు చౌక అవుతాయి. ఇది నేరుగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, మహిళలకు లాభదాయకం అవుతుంది’ అని అన్నారు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే ఇది 2017లో ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణల్లో ఒకటిగా ఇది నిలిచింది. జీఎస్టీ విధానం దేశంలోని పరోక్ష పన్ను వ్యవస్థను ఏకీకృతం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాల సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చింది.

Also Read This: Pavithra menon: జాన్వీ కపూర్‌పై మలయాళ నటి ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం