BSNL Rs 225 Plan: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇటీవల తన 25వ వార్షికోత్సవాన్ని ఇటీవల ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లతో తమ ఆనందాన్ని పంచుకునేందుకు తక్కువ బడ్జెట్ లో సరికొత్త ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అత్యంత చవకైన 30 రోజుల ప్లాన్ ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్..
అక్టోబర్ నెలలలో బీఎస్ఎన్ఎల్ పలు సరికొత్త ప్లాన్స్ ను ప్రకటించింది. అందులోని రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్ + 2.5 జీబీ డేటా (ప్రతిరోజూ) + BiTVలో 350 పైగా లైవ్ ఛానల్స్ + రోజుకు 100 SMSలను ఉచితంగా పొందవచ్చు.
ఇతర వాటితో పోలిస్తే…
ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ – ఐడియా వంటి టెలికాం సంస్థలు అందిస్తున్న నెలవారీ ప్లాన్స్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ రూ.225 ప్లాన్ ఏంతో చవకైనది. ఉదాహరణకు ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (Vi) సంస్థలు.. 30 రోజుల 2.5 GB డేటా ప్లాన్ ధర సుమారు రూ.399గా ఉంది. అంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ కంటే రూ.174 ఎక్కువ. దీన్ని బట్టి బీఎస్ఎన్ఎల్ ఎంత తక్కువ ధరకు ఈ ప్లాన్ ను తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
విస్తృతంగా 4జీ సేవలు..
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు.. బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 1 లక్ష కొత్త 4G టవర్లు ఏర్పాటు చేసింది. అదనంగా మరో 1 లక్ష టవర్లు త్వరలో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం వేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ కవరేజీ అందుబాటులోకి రానుంది.
Also Read: Adluri Laxman vs Ponnam: మంత్రి అడ్లూరితో వివాదం.. పొన్నం కీలక ప్రకటన.. వివాదానికి ఫుల్ స్టాప్ పడేనా?
పెరుగుతున్న యూజర్లు
ట్రాయ్ (TRAI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో భారతి ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ యూజర్లు బీఎస్ఎన్ఎల్ లోకి వచ్చి చేరారు. ఇది బీఎస్ఎన్ఎల్ సాధించిన ఉత్తమ ఫలితంగా టెలికాం నిపుణులు అభివర్ణించారు. అయితే ప్రస్తుతం జియో అత్యధిక కస్టమర్లు ఉన్న టెలికాం సంస్థగా కొనసాగుతోంది.
