Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధిస్తున్న ప్రతీకార సుంకాలు భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) ను ఒక్కసారిగా కుదిపేశాయి. దీంతో దేశీయ సూచీల్లో సోమవారం బ్లడ్ బాత్ కనిపించింది. ఫలితంగా ఆరంభంలోనే సెన్సెక్స్ 3వేల పాయింట్లుకుపైగా పతనమైంది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా తగ్గింది. దీంతో పెట్టుబడిదారుల మూలధనం రూ.19 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ఏప్రిల్ 4న BSEలో లిస్ట్ అయిన అన్ని షేర్ల మార్కెట్ విలువ రూ.4,03,34,886.46 కోట్లుగా ఉంది. ఇవాళ రూ.19,39,712.9 కోట్లు ఆవిరి కావడంతో.. BSEలో లిస్ట్ అయిన కంపెనీల షేర్లు.. రూ.3,83,95,173.56 కోట్లకు పడిపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో భారత్ పోటు.. హాంకాంగ్, చైనా మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. రోజూవారితో పోలిస్తే 10 శాతం మేర కుప్పకూలాయి. అలాగే ఆసియా, యూరోప్, అమెరికా మార్కెట్లలోనూ షేర్లు పతనమయ్యాయి.
Also Read: Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!
2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయి నష్టాలను చవిచూడటం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తైవాన్ సూచీ 9.61 శాతం మేర కుప్పకూలగా.. దక్షిణ కొరియా కోస్పి 4.14 శాతం, చైనా షాంఘై సూచీ 6.5శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 3.82 శాతం మేర నష్టాల్లో కూరుకుపోయాయి. జపాన్ నిక్కీ ఒక దశలో 8 శాతం వరకు పతనమవ్వగా.. ప్రస్తుతం 6 శాతం నష్టంతో అక్కడి మార్కెట్లు కొనసాగుతున్నాయి.