oct 31 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: వామ్మో ఒక్కరోజే భారీ షాకిచ్చిన గోల్డ్.. ఇక సామాన్యులకు అందనట్టేనా?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా తగ్గడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్తున్నారు. ఈ రోజు ధరలు మరింత భారీగా పెరగడంతో షాక్ అవుతున్నారు. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం “అబ్బా, ఇప్పుడేం కొంటాము.. వద్దు!” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా-డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. అక్టోబర్ 31, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 31, 2025)

అక్టోబర్ 30 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ పెరగడంతో షాక్ అయ్యారు. పెరిగిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,680
వెండి (1 కిలో): రూ.1,65,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,680
వెండి (1 కిలో): రూ.1,65,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,680
వెండి (1 కిలో): రూ.1,65,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,450
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,680
వెండి (1 కిలో): రూ.1,65,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,70,000 గా ఉండగా, రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.1,65,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,65,000
వరంగల్: రూ.1,65,000
హైదరాబాద్: రూ.1,65,000
విజయవాడ: రూ.1,65,000

Just In

01

Google: ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ వాడేవారికే ఎక్కువ స్కామ్‌లు.. గూగుల్ సంచలన కామెంట్స్

Prasanth Varma: ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్..

Viral Video: పులి వచ్చిందని పోస్ట్ పెట్టాడు.. చివరికి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు, అసలు ఏమైందంటే?

IND vs AUS 2nd T20I: అభిషేక్ ఒంటరి పోరాటం.. చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

Suryapet District: సూర్యాపేట జిల్లాలో.. ఎస్సై వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య!