Gold Price Today: భారీగా పెరిగిన గోల్డ్, బంగారం ధరలు
oct 24 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండు రోజులు తగ్గుముఖం పట్టడంతో గోల్డ్ లవర్స్ బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే రేట్స్ ఈ రోజు భారీగా తగ్గడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను కూడా చెమటలు పట్టిస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే మాత్రం వామ్మో మాకొద్దు అనుకుని వెనకడుగు వేస్తారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. అక్టోబర్ 24, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ  ధరల్లో చాలా మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 24, 2025)

అక్టోబర్ 22 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ అతి భారీగా పెరిగాయి. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,000
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,460
వెండి (1 కిలో): రూ.1,71,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,000
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,460
వెండి (1 కిలో): రూ.1,71,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,14,650
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,080
వెండి (1 కిలో): రూ.1,74,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,000
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,25,460
వెండి (1 కిలో): రూ.1,71,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,74,000 గా ఉండగా, రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.1,71,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,71,000
వరంగల్: రూ.1,71,000
హైదరాబాద్: రూ.1,71,000
విజయవాడ: రూ.1,71,000

Just In

01

GHMC Ward Delimitation: పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణకు..హైకోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్ గడువు!

Asim Munir – Trump: ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష.. పాకిస్థాన్‌ తర్జన భర్జన.. ట్రంప్ భలే ఇరికించారే!

Gold Rates: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Alleti Maheshwar Reddy: స్పీకర్ తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనే.. ఏడాదిన్నర కాలయాపన ఎందుకు?

MP Mallu Ravi: ఉపాధి హామీకి పేరు మార్పు ఎందుకు? ప్రజలే బుద్ధి చెబుతారు: ఎంపీ మల్లు రవి