Gold Rate Today: మరి కొద్దీ రోజుల్లో దీపావళి పండుగ రానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో గోల్డ్ లవర్స్ బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను కూడా చెమటలు పట్టిస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే మాత్రం వామ్మో మాకొద్దు అనుకుని వెనకడుగు వేస్తారు.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. అక్టోబర్ 10, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ ధరల్లో చాలా మార్పులు ఉండవచ్చని అంటున్నారు.
ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 10, 2025):
అక్టోబర్ 09 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు పరుగులు పెడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
Also Read: Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
హైదరాబాద్
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,100
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,290
వెండి (1 కిలో): రూ.1,80,000
విశాఖపట్నం
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,100
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,290
వెండి (1 కిలో): రూ.1,80,000
విజయవాడ
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,100
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,290
వెండి (1 కిలో): రూ.1,80,000
Also Read: BSNL New Plan: గుడ్ న్యూస్.. BSNL ధమాకా ప్లాన్.. ఇంత తక్కువా?
వరంగల్
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,100
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,290
వెండి (1 కిలో): రూ.1,80,000
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీ యంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,77,000 గా ఉండగా, రూ.3000 పెరిగి ప్రస్తుతం రూ.1,80,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
విశాఖపట్టణం: రూ.1,80,000
వరంగల్: రూ. రూ.1,80,000
హైదరాబాద్: రూ.1,80,000
విజయవాడ: రూ.1,80,000
