YSRCP Sailajanath (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్

YSRCP Sailajanath: తారక్‌ను దూరం పెట్టారు.. బాలయ్య కనిపించట్లేదు.. ఇదేం మహానాడు!

YSRCP Sailajanath: టీడీపీ ది మహానాడు కాదు దగా నాడు అని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ఆ నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది చంద్రబాబు నాయుడే, టీడీపీకి వారసుడు ఎవరు?, అసలు వారసుడు బాలకృష్ణ దబిడి దిబిడి అంటూ తిరుగుతున్నారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు ఎలా పెరిగాయి. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందని అన్నారు.

Also Read: KTR on MLAs: మనతో ఉండి వెన్నుపోటు పొడిచారు.. కేటీఆర్ సంచలన కామెంట్స్ !

ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలన్నారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని, లక్షా 30 వేల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదని చంద్రబాబుపై ద్వజ మెత్తారు. తెనాలిలో యువకులను పోలీసులు లాఠీలతో కొట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దళిత, మైనారిటీ యువకులను కాలితో తొక్కి లాఠీలతో కొట్టడం దుర్మార్గం, ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు ఎక్కువయ్యాయని సంచలన కామెంట్స్ చేశారు.

మీ రక్షణ కాదు ప్రజల రక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నట్లు తెలిసిందని, నిజమైన వారసులు లక్ష్మీపార్వతి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటని శైలజానాథ్ అన్నారు.

Also Read: Cabinet Expansion: ముందుకు సాగని మంత్రివర్గ విస్తరణ.. మోక్షమెప్పుడో!

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది